మహిళల రక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పని రోజులేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ‘షీ టీం’ పోలిస్ విభాగాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే సంచలనం రేపింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రేపిస్ట్ లను పిట్టలా కల్చేసున్నా నేరాల శాతం ఏ మాత్రం తగ్గడం లేదు. మరి ఎప్పుడు తగ్గుతాయి? ఎలా తగ్గుతాయి? అధికారులు ఎప్పడు జాగ్రత్త వహిస్తారు?
వికారాబాద్ కు చెందిన దంపతులు బతకడానికి హైదరాబాద్ లోని బండ్లగూడ లోని జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కి వచ్చారు. భర్త కూలి పని చేస్తుంటే భార్య ఓ గోప్పింట్లో పనిమనిషిగా చేస్తోంది.
ఆమెను ఎప్పటినుంచో గమనిస్తున్న శుభం శర్మ, సుమిత్ కుమార్ శర్మల కన్ను ఆమె మీద పడింది. వాళ్ళ ఇంట్లో పని మనిషి కావాలని, మంచి జీతం ఆశ కల్పించారు. ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నారు. రోజు మాట్లాడి ఆమెను మచ్చిక చేసుకున్నారు.
శుక్రవారం ఆమె ను ఉద్యగం చేసే చోటుకు తీసుకుని వెళ్తామని కార్ లో ఎక్కించుకున్నారు. ఆమెను మచ్చిక చేసుకుని మత్తు మందు కలిపిన చల్లని పానీయం తాగించారు. ఆమె మత్తుగా పడిపోగానే ఇద్దరు కలిసి ఆమెను పాశవికంగా మానంభంగం చేశారు. ఆమె ఒంటి మీద ఉన్న బంగారం లాక్కుని గండిపేట దగ్గరలో వదిలి ఉడాయించారు.
అర్థ రాత్రి స్పృహ లోకి వచ్చిన ఆమె నిజం తెలుసుకుని భర్తకు ఫోన్ చేసి జరిగింది చెప్పడి ఏడ్చింది. ఆమె ఎక్కడ ఉన్నదో కూడా చెప్పలేని పరిస్టితి. ఆ భర్త పోలీసులకు పిర్యాదు చేశాడు. నార్సింగ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ నేరస్తు ల ఫోన్ ఆధారంగా శుభం శర్మ, సుమిత్ కుమార్ శర్మలను గంటల వ్అయవధిలోనే రెస్ట్ చేశారు.
ఇక్కడ ప్రముక పోలిస్ ఆఫీసర్ చమండ వ్యాస్ చెప్పిన ఓ మంచి మాట గుర్తుకు తెచ్చుకోవాలి. ‘పోలీస్ అంటే నేరం జరిగా హంతకులను పట్టుకునేవాడు కాదు. అసలు నేరం జరగకుండా జాగ్రత్త పడేవాడే నిజమైన పోలీస్’ అని. ఈ మాటను ప్రతి పోలీస్ ఆఫీసర్ అమలు చేస్తే కానీ మహిళల మీద జరిగే అత్యా చారలు ఆగేలా లేవు. లేకపోతే ఎప్పటిలా రోజుకో వార్త ఇలా చదవక తప్పదు.