రాత్రికి వస్తావా.. నాతో గడిపితే గొడవ ఉండదు లేకపోతే అంతే సంగతులు.
హైదరాబాద్ నగరంలో మరో వనమా రాఘవ, కూకట్ పల్లి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి ఆగడాలు, లైంగిక వేధింపులు తట్టుకోలేక.. సీపీకి మహిళ ఫిర్యాదు చేసిన మహిళ.
హైదరాబాద్‌లో పేరొందిన నియోజకవర్గం కూకట్ పల్లి,
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే అతని అనుచరులదే హవా.. అధికారుల దగ్గర నుంచి అన్ని వర్గాల వారు వీళ్ళు చెప్పింది వినాల్సిందే. లేదంటే వారికి చుక్కలు చూపిస్తారు.
ఈ ప్రాంతం అతి ఖరీదైన ప్రాంతం కాబట్టి, ఇక్కడ వీరి కనుసన్నల్లోనే అక్రమంగా భవన నిర్మాణాలు కూడా జరుగుతాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు కేసులు, లేదా అనుచరులతో దాడులు.
ఇది నాణానికి ఒకవైపు మాత్రమే… మరోవైపు కథలు పుంఖాను పుంకాలు.. అందులో ఒక మచ్చుతునక ఇది.
కూకట్ పల్లి టిఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త సతీష్ ఆరోరా అలియాస్ రెడ్డి సతీష్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుడి భుజం ఇదంతా నియోజకవర్గ పరిధిలో అందరికీ తెలిసిందే.. కాని ఇతను చేసే అరాచకాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇతని లైంగిక వేధింపులు భరించలేక, తీవ్ర మానసిక క్షోభకు గురై, తనకు ఆత్మహత్యనే శరణ్యమని, తన ఫిర్యాదునే మరణ వాంగ్మూలంగా పరిగణిస్తూ తనకు న్యాయం చేయాలంటూ సోమవారం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది ఓ మహిళ.
స్థానిక పోలీసులు పట్టించుకోరని తెలిసి ఏకంగా సిపికి ఫిర్యాదు చేసింది.
ఆ మహిళ చేసిన నేరమేంటి,
ఎందుకు వేధింపులు..
సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం మెట్లెక్కన మహిళ, తన ఫిర్యాదులో తనగోడు చెప్పుకుంది. ఇంతకు వారు కూడా పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం. ఫిర్యాదులో ఏముందో తెలుసుకుందాం.
కూకట్ పల్లిలోని వసంతనగర్ లో డ్రెస్ మెటీరియల్ మ్యాచింగ్ సెంటర్ నడిపేది. ఆ పక్కనే ఉన్నవారు కొత్తగా భవన నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఆ మహిళ షాప్ గేట్ ముందు కార్లు నిలపడం, బిల్డింగ్ సామాగ్రి పెట్టడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని తొలగించాలంటూ చాలా సార్లు విన్నవించింది. అది పట్టించుకోకుండా, సామరస్యంగా విన్నవించుకున్న సదరు మహిళ పై ఆగ్రహించిన టీఆర్ఎస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ సమన్వయ కర్త సతీష్ అరోరా, కారు డ్రైవర్ తనను నోటికి వచ్చిన బూతులు తిట్టాడని, అలాగే బిల్డింగ్ ఓనర్ కూడా నువ్వెంత నీ బతుకు ఎంత అంటూ అవమానించాడని మహిళ సిపికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి లైంగిక వేధింపులు..
టీఆర్ఎస్ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ సమన్వయ కర్త సతీష్ అరోరా పలు సార్లు బెదిరంచడమే కాకుండా, లైంగిక వేధింపులకు గురిచేయ్యడమేకాకుండా, అలాగే తాను ఎక్కడికి వెళితే అక్కడ మనుషులను పెట్టించి అసభ్యంగా, బనాయింపులు చేయిస్తూ వేధిస్తున్నారని, తన ఫోన్ ను సైతం హ్యాక్ చేసి తన కాల్ రికార్డులు, వాట్సాప్ చాటింగ్, యూ ట్యూబ్, కెమెరా అన్నీ చూస్తున్నారని, తాను వేసుకునే డ్రెస్, ఆభరణాలు, ఇతరత్రా పర్సనల్ వ్యవహారాలు కూడా తనకు పంపుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనతో రాత్రి గడిపితే డబ్బులు ఇస్తానని, ఒక్క రాత్రైన తనతో గడపాలని వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది.
దుర్మార్గులకు కూకట్ పల్లి పోలీసులు సహకారం..
ఒక మహిళ అనికూడా చూడకుండా, స్థానిక పోలీసులు సైతం టిఆర్ఎస్ నాయకుని కనుసన్నల్లోనే నడిచి, వారు సైతం తనను వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.
సతీస్ అరోరా వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా, న్యాయం చెయ్యాల్సిన పోలీసులు కూడా తనకు న్యాయం చేయకపోగా ఓ కానిస్టేబుల్, మరో ఎస్సై తన వద్దకు వచ్చి స్టేషన్‌కు రమ్మని బలవంతం చేశారని, లేడి కానిస్టేబుల్ ఏదని అడిగితే ఆమెను పిలిపించి నేరం చేసిందానిలా తనను స్టేషన్ కు తరలించి అక్కడ సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారని వాపోయింది. ఎస్సై అవమానకరంగా మాట్లాడారని, కేసులు పెడతామంటూ బెదిరించారని, తన ఫోన్ తీసుకుని రెండు రోజుల వరకు ఇవ్వలేదని ఫిర్యాదులో వెల్లడించింది బాధిత మహిళ. తనకు జీవనాధారమైన బోటిక్ ను తీసేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే తాను అనేక ఇబ్బందులు పడుతున్నానని, ఆ టీఆర్ఎస్ నాయకుడు సతీష్ అరోరా తో తనకు ప్రాణహాని ఉందని, తనను, తమ కుటుంబాన్ని రక్షించాలంటూ పోలీసులను వేడుకుంది. ఒకవేళ తాను చనిపోతే ఈ ఫిర్యాదును మరణ వాంగ్మూలంగా పరిగణించాలని అందులో పేర్కొంది.
ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ ఇలాంటి వేధింపులతో ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నాడు, నిన్న కామారెడ్డిలో అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి వేధించడంతో తల్లి కొడుకులు అగ్నికి అహుతి అయ్యారు.
బంగారు తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని అనుకుంటే అధికార పార్టీ అరాచకాలు పెట్రేగిపోతున్నాయి, తెలంగాణలో బ్రతకాలంటే భయపడే స్థితిలో ప్రజలు ఉన్నారంటే కేసీఆర్ పరిపాలన ఎంత భయంకంగా ఉందో, చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఎంతగా సహకరిస్తున్నారో అర్ధమవుతుంది.