వివేకా హత్య కేసు ఎటు తేలకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. కొత్త, కొత్త పిటిషన్ లు దాఖలు చేస్తూ విచారణను సవ్యంగా సాగకుండా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండగా …అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది ఓ కొత్త వాదన వినిపించారు. ఇది ఇంతకుముందు విన్నది కాదు. కొత్తది.
వివేకా హత్య కేసు నిందితుడుగా నున్న సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారట. అది తట్టుకోలేకే సునీల్ యాదవ్ ను గొడ్డలిపోటుతో హత్య చేశారని హైకోర్టులో నిరంజన్ రెడ్డి ధర్మాసనం ముందు వాదించారు. సోమవారం జరిగిన విచారణలో ఇలాంటి విషయాలను చెప్పలేదు. సోమవారం రోజున ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించేందుకు వస్తే… మంగళవారం మాత్రం జగన్ కు సంబంధించిన కేసులో వాదించే నిరంజన్ రెడ్డి వచ్చారు. ఆయనే ఈ కొత్త వాదన వినిపించారు.
ఇప్పటివరకు ఈ విషయాన్ని వైసీపీ నేతలు కూడా ఎక్కడ చెప్పలేదు. ముస్లిం మహిళాను రెండో పెళ్లి చేసుకోవడంతో వారికీ ఓ బిడ్డ కూడా ఉన్నాడని.. ఆ అబ్బాయిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారని వివేకా అల్లుడు , కూతురు కలిసి ఆయన హత్యకు కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో అంత పస లేదనుకున్నారేమో కానీ ఇప్పుడు కొత్త వాదన వినిపించారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకా వేధించడంతోనే వివేకాను హత్య చేశాడని వివేకా క్యారెక్టర్ కు మరకలు పూసే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఆ మధ్య వివేకా కేసులో అల్లుడు, కూతురిని ఇరికించే ప్రయత్నం చేశారు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సునీల్ యాదవ్ తల్లి గురించి కొత్త కహనీ చెబుతున్నారు. ఎలాగు సునీల్ యాదవ్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని సునీల్ యాదవ్ మీదకు తోసేసి తాము మాత్రం సేఫ్ గా బయటపడాలనుకుంటున్నారు.
Also Read : వైసీపీకి మైండ్ బ్లాక్ చేస్తోన్న టీడీపీ – అసలు కథ ఏంటంటే..?