టాలీవుడ్ యాంకర్ , నటిగా అనితా చౌదరి మెప్పించి కొంతకాలం అలరించింది. ఆ తరువాత ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమైంది. చిత్ర పరిశ్రమకు ఆమె ఎందుకు దూరమైందో ఎవరికీ తెలియదు. తాజాగా అనిత చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నేను చిన్న వయస్సులో ఉండగానే మా నాన్న చనిపోయారు. దాంతో కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పుడే పెళ్లి ఆలోచన వద్దని కెరీర్ పై దృష్టి సారించాను. కానీ కృష్ణ చైతన్యతో పరిచయం వలన పెళ్లి చేసుకోవాలని అనిపించింది. తను ఉండేది అమెరికాలో. అతన్ని పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుందని కృష్ణ చైతన్యను వద్దనుకున్నా.
అయితే, కృష్ణ చైతన్య హీరో శ్రీకాంత్ కు కజిన్ కావడంతో ఆయనే నాకు ఫోన్ చేసి కృష్ణ చైతన్యను పెళ్లి చేసుకో అంటూ బలవంతం చేశాడు. తను ఎంత చెప్పిన వినిపించుకోకపోవడంతో మూడేళ్ళు అతనితో మాట్లాడలేదు. ఆ తరువాత కృష్ణ చైతన్యే వచ్చి ప్రపోజ్ చేయడంతో పెళ్లికి అంగీకరించాను అంటూ ఆమె పెళ్లి గురించిన ఇంట్రెస్టింగ్ వార్తను బయటపెట్టింది.