తన యాంకరింగ్ తో అందర్నీ అలరించే సుమ కనకాల అరెస్ట్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆమె అరెస్ట్ అయింది నేరం చేసిందుకు కాదు. ఓ మూవీ ప్రమోషన్ కోసం సుమను అరెస్ట్ చేశారు. అయితే అసలు విషయం తెలియని సుమ అభిమానులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. తీరా మూవీ ప్రమోషన్ కోసమే సుమను అరెస్ట్ చేశారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. ఇలాంటి స్టంట్స్ చేసి అభిమానులను కన్ఫ్యూజ్ చేయవద్దు.. మీరు కూడా ఇలాంటి పనికిమాలిన స్టంట్స్ చేసి అభిమానులను తప్పుదోవ పట్టిస్తారని ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో ఆమె ఇలాగే ఓ స్టంట్ చేశారు. తాను నటనకు గుడ్ బై చెప్తున్నానని ప్రకటించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. మొదట ఆమె నటనకు గుడ్ బై చెప్తున్నానడంతో నిజమేనని నమ్మేసిన సుమ అభిమానులు కన్నీటిపర్యంతం అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీరు మరికొంత కాలం యాంకరింగ్ తో మమ్మల్ని అలరించాలని కోరారు. చివరికి నటనకు గుడ్ వై చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని తాను ప్రాంక్ చేశానని చెప్పడంతో అభిమానులు సుమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో అభిమానులతో ఆడుకోవద్దని పేర్కొన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి స్టంట్ ఒకటి చేశారు.
అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం. ఈ సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఆయన గతంలో చేసిన చివరి రెండు సినిమాలు పూర్తిగా సోషల్ సబ్జెక్ట్ తో చేశారు. గతంలో కేవలం కామెడిని నమ్ముకొని సినిమాలు చేసి నవ్వించిన అల్లరి నరేష్ ప్రస్తుతం అలాంటి సినిమాలేం చేయడం లేదు. అల్లరి నరేష్ నటించిన తాజా మూవీకి ప్రచారం కల్పించడం కోసం ప్రమోషన్ స్టంట్ చేశారు. ఇందులో భాగంగా యాంకర్ సుమను అరెస్ట్ చేశారు. సుమ సంకెళ్ళతో బంధించబడి ఉన్న పిక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.