జబర్దస్త్ యాంకర్ గా అనసూయ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో తనదైన ముద్ర వేసుకుంది. అయితే అందంలోనే కాదు వివాదాల్లోనూ అప్పుడప్పుడు తలదూర్చుతూ ఉంటుంది ఈ భామ. లైగర్ సినిమా విడుదల సమయంలో అంటీ అన్న పదాన్ని వివాదంగా మలిచి పోలీసు స్టేషన్ కు లాగింది.
ఇటీవలే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసిన అనసూయ వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈవెంట్స్ లలో కూడా యాంకర్ గా ఎంటర్ టైన్ చేస్తోంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఇన్ స్టా లో అనసూయ పోస్ట్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్నేహితురాళ్లతో కలిసి అనసూయ ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడ మద్యం గ్లాస్ ను చేతిలో పట్టుకొని నవ్వుతున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. నిన్న ట్వాస్ వైన్ ఓ క్లాక్ కు వెళ్లాను. వైన్ తో ఉన్నప్పుడు నేను బాగానే ఉంటాను లేకపోతే ఉండను. మీకు వైన్ కలపడంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. ఇలాగే వర్థిల్లండి శ్రీముఖి మేకల అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అనసూయ పోస్ట్ చేసిన ఈ ఫోటోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మీరు వైన్ మాత్రమే తాగుతారా..? బీర్ కూడా లాగించేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన మహిళలు వైన్ తాగటం సాధారణమే కాని బయట ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అనసూయ ఇలా వైన్ తోనున్న పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ”రంగమార్తాండ” సినిమాలో అనసూయ ఓ కీలకపాత్ర చేస్తుంది.