యాంకర్ అనసూయ. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఫేస్. జబర్దస్త్ కామెడి షోలో యాంకర్ గా చేసిన అనసూయ నటిగా అవకాశాలు రావడంతో బిజీ అయిపొయింది. యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి సినిమాలో సైడ్ రోల్స్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ పలు వివాదాల్లో నిలుస్తుంటారు. ఆ మధ్య అంటీ అన్నారని సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసి షాక్ ఇచ్చారు. తనను అంటీ అన్నవారిని గుర్తించి బొక్కలిరగ్గొట్టాలని కోరారు.
తాజాగా నెటిజన్లతో అనసూయ వాగ్వాదానికి దిగారు. ఇంతకీ విషయం ఏంటంటే..మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది అనసూయ. నీతో నా జీవితం రోలర్ కాస్ట్ ఎక్కినట్లు ఉందని క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..ఇందులో వింతేముంది అక్కాయ్..వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ కామెంట్ చూడగానే అనసూయకు ఎక్కడలేని కోపమొచ్చింది. అక్కా అనడంతో తమ్ముడు అనే సంబోధిస్తూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది.
అదేంట్రా తమ్ముడు.. అంత మాట అనేశావ్. ఎంతుంది ఏంటి డబ్బు. నాకు లేదా డబ్బు..? మరి.. నీకు తెలుసు కదా. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా..? రేయ్ చెప్పురా బాబు.. అయినా బావగారిని వీడు, వాడు అనొచ్చా..? ఇదేం పెంపకంరా నీది.. చెంపలేసుకో.. లేకపోతే.. నేను వేస్తా చెప్పుతో .. సారీ అదే చెంపదెబ్బలు అంటూ కౌంటర్ ఇచ్చింది. దీనిపై ఆ నెటిజన్ మళ్ళీ రెస్పాండ్ అయారు.
మీరు సమర్ధించుకోకండి..అని సమాధానం ఇచ్చాడు. దీంతో మళ్ళీ అనసూయకు కోపం వచ్చింది. నీ బొందరా.. నీ బొంద.. ముందు మాట్లాడడం నేర్చుకో ఫస్ట్..అంతర్యామిలా అన్ని తెలిసినట్లు బిల్డప్ ఒకటి.. నేను సమర్ధించుకున్నానని అంటున్నావ్. నా రియాలిటి నీకేం తెలుసురా.? పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తోంది. తమ్ముడివి కదా మంచిగా చెప్తున్నా అంటూనే ఇక్కడి నుంచి దొబ్బెయ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది అనసూయ.