పెట్టుబడి దారుడు తనకు 20 శాతం లాభం వస్తుందంటే తన విస్తరణన కాంక్షను ఊరి సరిహద్దు దాటిస్తాడని ,యాభై శాతం లాభం వస్తుందంటే వాడ దాటతాడనీ , 80శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటతాడని, చిట్ట చివరకి తాను మరణిస్తే 100 శాతం లాభం వస్తుందని తెలిస్తే ఆ క్షణాన చంపడానికి చనిపోవడానికి గడియ కూడా ఆగడని ఆస్థిని కూడా బెట్టుకొనే క్రమంలో విలువలను ఎలా విస్మరిస్తాడో కార్ల్ మార్క్స్ రెండువందల ఏళ్ల కింద ఊహించాడు. పవర్ దానికి ఉన్న వికృతి,విశృంఖలత స్వభావాన్ని వివరించాడు. ఆయన ఈ వూహ చేసేనాటికి ప్రపంచం మొత్తం వలస పాలనలో ఉన్నప్పటికీ పెట్టుబడి ఇంత వికృతంగా లేదు. మతం ఇంత ప్రమాదకరంగా లేదు. ఫాసిజం కనీసం పుట్టలేదు.
ఇక్కడ అధానీ అనే పెట్టుబడి దారుడు అన్ని ప్రపంచ మూలల నూ తన కబంద హస్తాల లో ఉంచుకోవాలి అనే సాహస యాత్ర చేస్తున్నాడు. దానికోసం మన వ్యక్తిగత కుటుంబం ఆస్తి లేని తాత తన చెమట నెత్తురు దారబోస్తున్నాడు.
జాతీయ బూర్జువా శక్తులు పాలకవర్గం తో అంటకాగడం టాటా ల మొదలు అదానీ దాకా కొనసాగుతూనే ఉంది. గడిచిన తొమ్మిదేళ్ళలో అదాని అంబాని ఈ దేశ సంపదను పాలననూ శాసిస్తున్నారు ఇవ్వాళ ఫాసిస్టు కనుసన్నల లో దేశ సకల సంపదనూ దోచి అదాని పరం చేసింది.
వందేళ్ళ ట్రేడ్ యూనియన్ , ఇంకో వందేళ్ళ వామపక్ష ఉద్యమం, మరో యాభై ఏళ్ళ బలమైన నక్షల్బరీ ఉద్యమాలు ఈ దేశ అర్ధవలస, అర్ధభూస్వామ్య దోపిడీ దుర్మార్గపు సంపద మీద రాసారు, కూసారు,కోశారు.భారత్ బందులూ సమ్మెలూ హార్తాల్లూ ఒకటేమిటి చేయని ఉద్యమ కార్యాచరణ లేదు. సమస్త కార్మికులారా ఏకం కండి అనే నినాదం సమస్త పెట్టుబడిదారీ కుక్కలారా ఏకం కండి లా మారింది. అయినా లక్షల కోట్ల సంపదను ఒక అంబులెన్సు డ్రైవర్ కూల్చేసాడు. అంటే అదాని అంత తేలికగా కూలడు అని అందరికీ తెలుసు.
‘అదాని ఒక స్కూల్ డ్రాపౌట్ , ప్రపంచ సంపన్నులు సరసన చేరడానికి అత్యంత గోప్యమైన చదువు చదివిన ఈ దేశ ప్రధాని చౌకీదార్ అండగా ఉన్నాడు. ఇద్దరి భాగస్వామ్యం లో నిర్మించ బడిన సామ్రాజ్యాన్ని , ప్రపంచ మూడో అత్యంత సంపన్నున్ని , ఒక్క రోజులో లక్షల కోట్ల సంపద మట్టిపాలు చేసాడు. అదాని సామ్రాజ్యం అబద్దపు పునాదుల మీద నిలబడ్డది అని చెప్పడానికి నువ్వు కాపిటల్ చదవచ్చు. ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్ లో చదవొచ్చు. నువ్వు జోసెఫ్ స్తిగ్లిజ్ వి కావొచ్చు, థామస్ పికేట్టి వి కావొచ్చు. ఎకనామిక్స్ లో నోబెల్ పొందొచ్చు.
అధమా ప్రభాత్ పట్నాయక్, కారత్ ఏచూరి. ఇంకా..ఇంకా.. ఎందరో అలగాలు…….
మీ రాతలు మీ కార్యాచరణ అవగాహన పెట్టుబడిదారీ సమాజం వికృత రూపం గురించి మీరేమిచ్చారో మేమేమి నేర్చుకున్నామో తెలియదు గానీ
నాలుగైదు ఏళ్ళకింద వరకు కూడా వాడెవడో, ముక్కేదో ముఖమేదో తెలియని నాథన్ అండర్ సన్ ఒక చిన్న యూనివర్సిటీ లో డిగ్రీ పోరగాడు. మన భాషలో బచ్చా. ఒక అంబులెన్సు డ్రైవర్. (కొద్దికాలం (సోర్స్:రాయిటర్స్ )
ఒక్క చిన్న విస్వశనీయమైన(??) డాక్యుమెంట్ తో ఏ పెట్టుబడి దారీ ప్రయోజనాల లక్ష్యం కోసం అయినా ఒక అబద్దపు సామ్రాజ్యానికి కింద బాంబ్ పెట్టి లేపాడు. అది కూలిందా మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా లేసుద్డా నాకనవసరం . ఒక మాయా సామ్రాజ్యాన్ని కనీసం మూడు రోజులు అయినా ఊపిరి తీసుకోకుండా చేసాడు. వాడు నాకు హీరో.
హిండెన్ బర్గ్ ఒక చిన్న సంస్థ అది మొదలై ఆరేళ్ళు కూడా కాలేదు. ఇప్పటివరకు పదిహేడు కంపనీల ఆర్ధిక మోసాన్ని వెలుగులోకి తెచ్చాడు. అలా చీకట్లోకి పంపి న వెలుగులు ఏ కలుగులోకి పోతున్నాయో అది వేరే చర్చ. కానీ ఇన్వెస్టర్లు, పాత్రికేయులు, పాలకులు, ఎవ్వరూ నోరు విప్పని చోట వీడోక్కడే నిలబడ్డాడు. వాడు శ్వేత జాతీయుడు కావొచ్చు. అదమా ఒక థగ్ అమెరికా ఐరోపా పెట్టుబడిదారీ వర్గం లో చేరడం తట్టుకోలేని ఒక రేసిస్ట్ కావొచ్చు అయినా వాడు నాకు హీరో.
మోసం, దగా,వంచన,కుట్ర,దోపిడీ ఎన్ని పేర్లు అయినా పెట్టుకో ….
ఫ్రాడ్, మనీ లాండరింగ్,స్టాక్ మన్యుపులేషన్స్ ఒకటేమిటి సకల దోపిడీలకు నిలయం అదాని కాబట్టే ఆరేడు ఏళ్ళలోనే తన వ్యాపార విస్తృతి నీ విశాలమైన వ్యాపార చితినీ పెర్చుకున్నాడు. ఆ చితికి అండర్ సన్ నిప్పంటించాడు. ఎంత నిప్పు పెట్టినా కాలడానికి అది రాచ పీనుగ దాంతోబాటు అనేక ప్రభుత్వ బ్యాంకు లు ప్రభుత్వ రంగ సంస్థలూ ఆ చితిలో ఉన్నాయి. అవి కాలతాయో కూలతాయో పారాడతాయో మన ట్రేడ్ యూనియన్ నాయకుల కాట్ వాక్ తో కలిసి పోరాడతాయో మనకు తెలీదు…
ఇంత సీరియస్ స్టాక్ మాయ జరుగుతున్న కాలం లో ఒక్క రాజకీయ పార్టీ నుండో ఇంకో పబ్లిక్ ఇంటలెక్ట్ నుండో ఒక సీరియస్ కామెంట్ వస్తాదేమో అని చూసా..ఊహూ..
మనకి సీరియస్ విషయాలు మాట్లాడడం రాయడం రాదు అని తెలుసు. లెఫ్ట్ ఫ్రంట్ నో , పాపులర్ ఫ్రంట్ నో తెలంగాణ సమాజాన్ని బారత రాష్ట్ర సమితి సభలకు జెండాలు కట్టి యానాన్ చేయబోతున్న వి అని కళలు కంటున్న బేహారుల మీదనో అక్కసు కాదు.
ఇదేదో ఏ ఒక్క పార్టీ నో ఆడిపోసుకోవడం నా లక్ష్యం కాదు గానీ సకల వామపక్ష కూటమి అదానీ వ్యాపార సామరాజ్య దోపిడీ మీద ఒక్క ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లోనో, టైమ్స్ లోనో అధమా కాసింత కమ్యూనిజం కూడా అర్ధం కాని రాం లాంటి వాళ్ళు కూడా (వార్నింగ్ బెల్స్ అని ఏదో రాసుకున్నారు లే ) ఏమీ రాయలేదు ఏమిటా అని నా బాధ.
జనాలు మనకి ఒక యాభై కోట్లు ఇచ్చి టివీ పెట్టుకోండి అని అంటే మూడు షెల్ కంపెనీలు పెట్టి నడపడం రాక అడ్డంగా కార్పోరేట్ ఫ్రాడ్ ఏజెన్సీ కి దొరికిన మీ నుండి అధానీ వ్యాపార సామ్రాజ్యం వాడు చేస్తున్న వ్యాపార మోసాల మీద రాసే నైతికత, నైఘంటిక జ్ఞానం, విద్వత్ ఉందని అనుకోను.
అంతేనా లేదా యజమాని ఆయుధాల తో యజమాని సౌధాలను కూలుద్దాం అని కళలు కంటున్నారా ?
చివరగా మనకింత మంది మేథావులు ఉన్నారు అనే బ్రమ లో బ్రతుకుతున్నాం. అర్ధం కాని బడ్జట్ మీద మా ఊరి మూడో తరగతి పాస్ అవుట్ పార్టీ మెంబెర్ కూడా ఇది మోసపూరితం అనీ, కొత్త సీసాలో పాత సారా అని అంటుంటే అబ్బో ఎంత జ్ఞానమో కదా అని మురిసిపోయే వాణ్ని . క్నాలేద్జ్ ఈజ్ డి’వైన్’ అంటే అంటే ఏ బ్రాండ్ వైన్ నో
అనుకునే సంతన…. నుంచి నేనేమి బావుకునేది సావీ….
గుర్రం సీతారాములు
Also Read : అయ్యో అదాని … పెయిడ్ బ్యాచ్ తో దొరికిపోయావ్ గా…!