బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బాగోతం మెల్లగా బయటపడుతోంది. ఒక్కొక్కరి అసలు రంగు బయటకు వస్తోంది. ఇటీవలే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాసలీలల పర్వం బయటకు రాగా తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపుల బాగోతం బయటకొచ్చింది.
డెయిరీ వ్యాపారం నిర్వహించే ఓ మహిళా వ్యాపారిని వేధిస్తోన్న ఆడియోతోపాటు వాట్సప్ చాట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో దుర్గం చిన్నయ్య కామకేళి మీడియాలో హైలెట్ అవుతోంది. డెయిరీ వ్యాపారాన్ని విస్తరించేందు కోసం ఆ సంస్థ సీఈవో ఎమ్మెల్యేను కలిశారు. ఇందుకు సహకరించాలంటే తన వద్దకు అమ్మాయిల్ని పంపాలని దుర్గం చిన్నయ్య ఒత్తిడి చేశారని ఆ మహిళా వ్యాపారి ఆరోపిస్తున్నారు.
దుర్గం చిన్నయ్య వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని తెలిపింది. అయితే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తోన్న మహిళా వ్యాపారి కూడా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండటం గమనార్హం. తమను డెయిరీ ఫామ్ పేరుతో మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై కేసులు నమోదయ్యాయి.
వ్యాపార విస్తరణతోపాటు ఈకేసుల విషయంలోనే ఎమ్మెల్యేలను సహకరించాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. దీంతో నీకు సహకరించాలంటే తనకు నచ్చిన అమ్మాయిల్ని తన వద్దకు పంపాలని మహిళాపై ఎమ్మెల్యే ఒత్తిడి చేసినట్లు చెబుతున్నారు. అటు రాజయ్య.. ఇటు దుర్గయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యేపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేల వ్యవహారాలు బీఆర్ఎస్ హైకమాండ్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గతంలో ఓ మంత్రి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇలాంటివి ఇంకా ఎన్ని బయటకు వస్తాయోనని బీఆర్ఎస్ పెద్దలు కూడా కంగారు పడుతున్నారు. ఇలా అధికార పార్టీకి చెందిన నేతల బాగోతం ఒక్కొక్కరిగా బయటకు వస్తోంది.ఈ క్రమంలోనే క్యూ న్యూస్ ప్రతినిధులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మార్నింగ్ న్యూస్ లో వార్త విశ్లేషణ సందర్భంగా ‘ తమ వద్ద అధికార పార్టీకి చెందిన 25మంది ఎమ్మెల్యేల రాసలీలల బాగోతాలు’ ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు వాటన్నింటిని బయటపెడుతామని చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది.