2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ బోలెడు హామీలు ఇచ్చింది. అందులో ఒకటి మద్యపాన నిషేధం. వైసీపీ అధికారంలోకైతే వచ్చింది కాని, ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం హామీని అమలు చేసింది లేదు. ఇప్పుడు దానిని అమలు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి మీడియాకు చెప్పారు.
మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా చూస్తోంది ఏపీ సర్కార్. దాంతో మద్యపాన నిషేధంతో ఆదాయం మరింత పడిపోతుందని అంచనా వేసింది. దాంతో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు టూరిజం పేరుతో అదనంగా దుకాణాలు తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇటీవల ఇచ్చిన హామీ వైరల్ అవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇరవై శాతం దుకాణాలు గీత కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చారంటే లిక్కర్ పాలసీని మారుస్తారని అర్థం. దీంతో తెలివిగా ఆలోచించిన వైసీపీ అధిష్టానం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేముందు మద్యాన్ని నిషేధిస్తూ జీవో విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read : ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు ఇదే ఫస్ట్ ఛాన్స్..!
ఎన్నికలకు ముందు రెండు, మూడు నెలలు మద్యంపై నిషేధం ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు ఎలాగూ ఇచ్చిన హామీకి కట్టుబడి మద్యంపై నిషేధం తీసేస్తారు. అప్పుడు మద్యపాన నిషేధం తాము విధించామని.. చంద్రబాబు వచ్చాక మళ్ళీ తీసేసారని చెప్పుకోవచ్చన్నది వైసీపీ ప్లాన్. అదే జగన్ గెలిచినా మద్యంపై నిషేధం తీసేస్తారు. ప్రజలే తీసేయమన్నారని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తారు. ఎలా చూసిన ఎన్నికలకు ముందు మద్యం కేంద్రంగా రాజకీయాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Also Read : చెల్లి విషయంలో జగన్ సైలెంట్ – ఏమిటా సీక్రెట్..?