మా పులి మాంసం తినదు, పులిహోర తిని పెరుగుతోంది అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పచ్చి అబద్దాలు చెపుతుంటే కెసిఆర్ చిరు నవ్వులు చిందించారు. బి జె పి నేతలు దానికి జై కొట్టారు అసెంబ్లీలో. మొదటినుంచి బిఆర్ఎస్ కి అనుబంధ సంస్థగా ఎంఐఎం ఉన్నదని అందరికి తెలుసు. 90 శాతం ముస్లింలు ఉన్న పాతబస్తి లో 38 శాతం కరెంట్ బిల్ కట్టరని అందరికి తెలుసు. అంటే ఏడాదికి దాదాపు రూ 800 కోట్లు.
నేడు విద్యుత్ శాఖ నష్టాల్లో పుడుకుపోవడానికి పాతబస్తే కారణం అని ఆ శాఖ పలుమార్లు ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆ డబ్బులు వసూలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని లోగడ మొట్టికాయలు వేసింది. అయినా ఎంఐఎంతో కుదిరిన చీకటి ఒప్పందం మేరకు మౌనం వహించి ఆ నష్టాన్ని తెలంగాణ మొత్తం కట్టేలా విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచింది. ప్రభుత్వ అసమర్థ పరిపాలన వల్ల యావత్తు తెలంగాణ మూల్యం చెల్లిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ లో మాట్లాడుతూ పాత బస్తీలోని ముస్లింలు 96 శాతం కరంట్ బిల్ లు చెల్లిస్తున్నారని మొండిగా వాదించారు. ఈది తప్పని రుజువు చేస్తే ఆ బకాయిలను తాను వసూలు చేయించి కట్టిస్తానని కెసిఆర్ మీద సవాలు విసిరాడు. దానికి కెసిఆర్ వెంటనే ఒప్పుకుని ఓ కమిటి వేయలేదు. ఆవలిస్తూ కూర్చున్నాడు. బిజెపి నాయకులు మౌనంగా కూర్చున్నారు.
మతం పేరుతో చిచ్చు పెట్టి ప్రజలను తన్నుకు చావండి అని బిజెపి చెపుతుంది. మరి హిందువులకు మేలు చేస్తూ ఎంఐఎం చెవిని ఎందుకు మెలి వేయదు? అంటే వాళ్లు చల్లగుండాలి – ప్రజలు మంటల్లో మాడిపోవాలా..?