బాలీవుడ్ అగ్రశ్రేణి కథా నాయికగా అలరించిన ఐశ్వర్యరాయ్ ఇంకా సినిమాలో అలరిస్తూనే ఉంది. “ఇమ్రావ్ జాన్” అనే సినిమాలో అభిషేక్ బచ్చన్ తో నటించిన సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది.
బుధవారం ఐషూ – అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య జన్మదినం కావడంతో సామజిక మాధ్యమాల్లో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బర్త్ డే సందర్భంగా తన కూతురికి లిప్ లాక్ చేసిన ఫోటోలు ఇన్స్టా లోని తన అకౌంట్ లో షేర్ చేసింది.
అంతేకాకుండా నా ప్రేమ, నా జీవితం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఆరాధ్య అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇషూ షేర్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.