”నేను పారేసుకున్న నా బాల్యం ఎక్కడుందని వెతుక్కోను?” అని ఓకవి హృదయం రగిలి అన్నాడు. కానీ ఇప్పుడు మన దేశంలో అందరు పిల్ల పరిస్టితి ఇదే. తల్లిపాలు మరువక ముందే, తల్లి ఒడిలో తనివితీరా ఆడుకోక ముందే, తమ అల్లరితో ఇల్లు పీకి పందిరి వేయకముందే నర్సరీ పేరుతో ప్రీ స్కూల్స్ అనే జైలు లో పిల్లలను వేసున్నారు తల్లిదండ్రులు.
అమ్మకు, ఆయమ్మకు తేడ తేలియని ఆ పసికందులు సాటి పిల్లలతో ఆడుకుని తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోవడం లేదు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల తమ పిల్లను తప్పటడుగులు వేయక ముందే నర్సరీ స్కూల్ కి పంపి చేతులు దులుపుకుంటున్నారు. పెరిగిన తరువాత ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తారు? వాళ్ళను కూడా వృద్దాశ్రమనికి పంపి ఎందుకు చేతులు దులుపుకోరు? ఈ ఊరు నుంచి ఆ ఉరు ఎంత దూరమో – ఆ ఉరు నుంచి ఈ ఊరు కూడా అంతే దూరం.
ఈ పరిస్తితిని కేంద్ర విద్యా శాఖా బాగానే అర్థం చేసుకుంది. అందుకే ఇకనుంచి ఆరేళ్ళు నిండిన పిల్లను మాత్రమే ఒకటో తరగతిలో చేర్చు కోవాలని కొత్త జి వో విడుదల చేసింది. ఇది కేవలం ప్రభుత్వ బడులకే కాదు – అన్ని రాష్ట్రాలలోని ప్రైవేటు, ప్రభుత్వ అనుబంధ బడులు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఇందుకుగాను టీచర్ల కు ‘ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం’ పేరుతో రెండు సంవస్తరాల డిప్లమా కోర్సుని ప్రవేశ పెట్టనుంది. దీని విధి విధానాలను ‘స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్ సి ఈ ఆర్ టి) రూపొందిస్తోంది. దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేయాలనీ కసరత్తు చేస్తోంది.