గౌతమ్ అదానీ కంపెనీలన్నీ పేక మేడలని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అదానీ సంస్థలు ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ అబద్దాలనునివేదించిందని చెప్పారు. కానీ నిజాలు ఏంటో అదానీ గ్రూప్ కూడా చెప్పలేదు.
తాము ప్రకటించిన వివరాలు తప్పైతే .. తమపై లీగల్ గా ప్రొసీడ్ కావాలని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సవాల్ చేసింది. అయినప్పటికీ అదానీ గ్రూప్ ఎలాంటి రియాక్షన్ లేకపోయింది. దీంతో ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుండి అదే పనిగా అమ్మకాలు కొనసాగాయి.
అదానీ కంపెనీలపై ఇన్వెస్టర్లకు నమ్మకం సన్నగిల్లడంతో కంపెనీలన్నీ భారీ నష్టాలు చవిచూశాయి. ఒకటో.. రెండో కాకుండా ఏకంగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు షేర్ల ధరలు పతనమయ్యాయి. దీంతో అదానీ గ్రూప్ వాల్యూ ఇరవై శాతంకు పడిపోయింది.
రెండు రోజుల్లోనే పదకొండు లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఇందులో అదానీ గ్రూప్ అత్యధికంగా నష్టపోయింది. హిండెన్ బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ సరైన వివరణ ఇవ్వకపోవడంతోనే ఇదంతా జరుగుతోందని అంటున్నారు.
అదానీ గ్రూప్ షేర్లు అత్యధికంగా ప్రభుత్వ రంగబ్యాంకులు, ఎల్ఐసీ వద్ద ఉన్నాయి. అవి మార్కెట్లలో ఇంకా అమ్మకాలు స్టార్ట్ చేయలేదు. అవి ప్రారంభిస్తే షేర్ ధర మరింత పతనమవుతుంది. కాని కేంద్రం వాటి అమ్మకాలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు. కానీ అదానీ గ్రూప్ షేర్ హోల్డర్లు మాత్రం తమ షేర్లను అమ్ముకోవాలని చూస్తున్నారు.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక విషయంలో ఆదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ నివేదికపై ఎదురుదాడి చేయకపోతే ఆ సంస్థ బయట పెట్టినవన్నీ నిజాలేనని ఇన్వెస్టర్లు నమ్ముతారు. అదే కనుక జరిగితే అదానీ గ్రూప్ లు కుప్పకూలడం ఖాయం.
Also Read : ఇండియా ఆర్ధిక వ్యవస్థకు అదానీ గండం
Also Read : దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు – అదానీ విషయంలో కేంద్రం సైలెంట్