హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదికపై అదానీ గ్రూప్ ఆలస్యంగా రియాక్ట్ అయింది. తాము బయటపెట్టిన నివేదిక తప్పైతే న్యాయస్థానాల్లో దావా వేయాలని హిండెన్ బర్గ్ సవాల్ చేసిన.. మూడు రోజుల తరువాత ఆరు పేజీలతో వివరణ ఇచ్చి ఎదురుదాడి ప్రారంభించింది.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదికను దేశంపై దాడిగా అభివర్ణించింది అదానీ గ్రూప్. దేశ వృద్దిని తట్టుకోలేక ఇలాంటి నివేదికను రూపొందించారని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో ఏం జరిగినా దేశం కోసం ధర్మం కోసమని బీజేపీ జాతీయవాదాన్ని అడ్డు పెట్టుకునేది. ఇప్పుడు ఈ వ్యూహాన్ని అదానీ గ్రూప్ కూడా ట్రై చేస్తోంది.
గతంలో అమెరికాలోని పలు కంపెనీలు తప్పుడు విధానాలకు పాల్పడ్డాయి. వాటి వివరాలను హిండెన్ బర్గ్ బయట పెట్టింది. అప్పుడు అక్కడి సంస్థలేవి తమ దేశంపై హిండెన్ బర్గ్ దాడి చేస్తోందని అనలేదు. కాని ఇండియాలో మాత్రం జాతీయవాదాన్నికున్న పవర్ దృష్ట్యా, మోడీకి సన్నిహితుడు కావడం వలన అదానీ ఈ తరహ వాదనను వినిపిస్తున్నారు కావొచ్చు.
మార్కట్ లోనున్న ప్రతి ఒక్కరికి అదానీ గ్రూప్ లావాదేవీల గురించి తెలుసు. అది గాలి బుడగేనని ఎప్పుడైనా పేలిపోవచ్చునని అంచనాలు ఉన్నాయి. కేంద్రంలోని పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన సంస్థలు నిలబడుతున్నాయని కార్పోరేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎప్పుడో ఓ రోజు నిజం బయటకు రాక తప్పుడు కదా.. ఇప్పుడు నిజాలు బయటకు రాగానే.. అదానీ గ్రూప్ జాతీయవాదాన్ని అడ్డు పెట్టుకునెందుకు ప్రయత్నిస్తోంది.