సౌందర్య.. మహానటి సావిత్రి తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఈమె. అందం, అభినయంతో అచ్చమైన తెలుగు ఆడపడుచులాగా కనిపించి ఎంతోమందికి అభిమాన హీరోయిన్ గా నిలిచింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం సాంప్రదాయబద్దమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేమైన ఇమేజ్ ను సంపాదించుకుంది సౌందర్య.
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించింది సౌందర్య. అప్పట్లో సౌందర్యతో కలిసి ఓ సినిమా చేయాలని టాప్ హీరోలందరికీ ఓ డ్రీంగా ఉండేదంటే ఆమె క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే.. సౌందర్య తన చిన్ననాటి స్నేహితుడు రఘును వివాహం చేసుకుంది.
సినీ ఇండస్ట్రీ, బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. ఆ ఫోటోలు , వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి. వీరిద్దరి పెళ్లి 2003లో జరిగగా.. పెళ్లి జరిగిన మరుసటి ఏడాదే ఆమె విమాన ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిందని తెలిసి కుటుంబ సభ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమ, సౌందర్య అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సౌందర్యకు తన భర్త రఘు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె సంపాదించిన ఆస్తులన్నీ అతని పేరిట రాసింది. ఆమె చనిపోయిన తరువాత ఈ ఆస్తుల విషయంలోనే రఘు మరియు సౌందర్య తల్లిదండ్రులకు గొడవలు కూడా జరిగాయి. సౌందర్య మరణంతో కొన్నాళ్ళకు రఘు మరో పెళ్లి చేసుకొని గోవాలో ఉంటున్నారు.
అయితే.. సౌందర్య చనిపోయే నాటికి ఆమెకు ఓ కొడుకు ఉన్నాడని అప్పట్లో వార్త వచ్చింది. కాకపోతే అతని పరిచయం చేయలేదని ప్రచారం జరిగింది. సౌందర్య అకాల మరణంతో కొడుకు బాధ్యతను రఘు తీసుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వార్తలను సౌందర్య సన్నిహితులు ఖండించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌందర్య సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. సౌందర్య పెళ్ళైన రెండేళ్ల వరకు పిల్లల్ని కనకూడదు అని అనుకుందని, సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్ని నమోద్దు అంటూ ఈ సందర్భంగా తెలిపారు.
Also Read : ఇద్దరు భార్యలు ఆ భర్తను ఎలా పంచుకున్నారో తెలుసా..?