సెలబ్రిటీలు ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తారు. పొద్దున లేస్తే నైట్ వరకు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. గతంలోనంటే సోషల్ మీడియా లేదు కాబట్టి, పేపర్ లోనో, టీవీలోనో సెలబ్రిటీల లైఫ్ కు సంబంధించిన విషయాలను చూసి తెలుసుకునే వారు. ఆ రోజులు పోయాయి. ఏ విషయమైనా, అది మంచిది అవ్వని, చెడు కాని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఓ గుడ్ న్యూస్ ను దాచిపెట్టింది.
ఆ హీరోయిన్ ఎవరని ఆశ్చర్యపోకండి. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రశ్రేణి కథానాయికగా అలరించిన శ్రియ. తనకు సంబంధించిన గుడ్ న్యూస్ ను కొన్నాళ్ళు దాచేసింది. తాజాగా దృశ్యం 2సక్సెస్ మీట్ లో పాల్గొన్న శ్రియ తన ప్రెగ్నెన్సీ విషయాన్నీ ఏందుకు దాచాల్సి వచ్చిందో రీజన్ చెప్పేసింది.
నా కూతురు కడుపులో ఉన్నప్పుడు మధుర క్షణాలను మనసారా ఆస్వాదించాలని అనుకున్నాను. ఎలాంటి ఒత్తిడికి లోను కాకూడదని భావించాను. ప్రెగ్నెన్సీ విషయంలో ఎవరైనా లావు అవుతారు కాని, జనాలు మాత్రం ఈ విషయం పట్టించుకోకుండా ఏవేవో మాట్లాడుతుంటారు. ఈ విషయం బయట తెలిస్తే బాడీ షేప్, నా బిడ్డపై ఫోకస్ చేస్తారు. అందుకే ఒత్తిడి ఉండకూడని భావించే ప్రెగ్నెన్సీ విషయాన్నీ దాచినట్లు శ్రియ వెల్లడించింది. శ్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.