నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి విషయం మరోసారి తెరపైకి వచ్చింది. పవిత్రని నరేష్ విహాహం చేసుకుంటారన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గతంలో పెళ్లి ఆలోచనే లేదన్న నరేష్.. ఇటీవల విడుదల చేసిన వీడియోలో మాత్రం కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పవిత్రతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటానని..తమ మధ్యనున్న అనుబంధం ఎంతవరకు వెళ్తుందో చూడాలని నరేష్ చెప్పారు. ఇక ,నరేష్ నాలుగో పెళ్లి ప్రకటనపై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి దారుణమైన ఆరోపణలు చేసింది.
తనను వదిలించుకోవడానికి నాకు కృష్ణగారితో ఎఫైర్స్ అంటగట్టాడు. దేవుడు లాంటి కృష్ణగారితో అక్రమ సంబంధాలు ఉన్నాయని మానసిక వేదనకు గురి చేశాడు. డ్రైవర్ తో కూడా సంబంధం అంటకట్టాడు. ఇలా నాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. కృష్ణగారికి నా వలన ప్రాణహాని ఉన్నట్లు ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశాడు. అది కృష్ణగారు నాపై కంప్లైంట్ చేస్తున్నట్లు రాసి, ఆయన సంతకం ఫోర్జరీ చేశాడు. దాని ఆధారంగా కేసు పెట్టాడు. ఈవిధమైన ఆరోపణలు చేస్తూ ఇంగింత పరిజ్ఞానం లేని నరేష్, నా కొడుకు ముందే పో* వీడియోస్ చూసేవాడు. అతను ఎంత నీచంగా వ్యహరించిన నరేష్ కి విడాకులు ఇచ్చేదే లేదని రమ్య స్పష్టం చేసింది. నా కొడుకు తండ్రి కావాలని అడుగుతున్నాడని రమ్య చెప్పింది.
ఎట్టి పరిస్థితులలో నరేష్ – పవిత్ర లోకేష్ విహాహం జరగనివ్వనని తెగేసి చెప్పింది రమ్య. అయితే, నరేష్ మూడో భార్య మాట్లాడిన వ్యాఖ్యలపై సీనియర్ నటి పూజిత స్పందించింది. నరేష్ చాలా మంచి వ్యక్తి అని చెప్పింది. ఎందుకంటే తాను కొన్ని సందర్బాలలో ఎదుర్కొన ఇబ్బందులకు ఆతడు అడగనే సహాయం చేశాడని తెలిపింది. రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఒక సహాయం కోసం ‘మా’ కార్యాలయానికి వెళ్ళాను.
నాతో రాజేంద్రప్రసాద్ చాలా సినిమాలో కలిసి నటించాడని పూజిత చెప్పింది. రాజేంద్రప్రసాద్ తో పరిచయాలు ఉన్నప్పటికీ తాను ఎవరో అన్నట్టు పట్టించుకోకుండా ఉన్నాడు. అలాంటి సమయంలో నరేష్ నా సమస్యలను తీర్చారు. నరేష్ మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నటుల కోసం అనేక సంక్షేమ పథకాలు తిసుకొచ్చారని పేర్కొంది. ఆయన ఒక శనిని నెత్తిన పెట్టుకున్నాడని పూజిత వెల్లడించారు.
Also Read : పవర్ స్టార్ వలన ఫ్యామిలీ రోడ్డున పడింది – అషూరెడ్డి సంచలన వ్యాఖ్యలు