టాలీవుడ్ లో అలనాటి స్టార్ హీరోలందరి సరసన నటించిన మీనాకు ప్రేమ కథ ఉందట. ఆమె ఓ హీరోను ప్రేమించిందని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ అప్పటికే అతనికి పెళ్లి అయిందని తెలుసుకొని చాలా రోజులు బాధపడినట్లు చెప్పింది మీనా. అతనంటే చెప్పలేనంత ఇష్టమని.. పెళ్ళంటూ చేసుకుంటే అతని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిందట. కానీ అసలు విషయం తెలిసి మనసుకు సర్దిచెప్పుకొని ఆ బాధ నుంచి బయట పడినట్లు చెప్పింది మీనా.
బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా ఇరవైకి పైగా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నవయుగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా… చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున , బాలకృష్ణ, రజినీకాంత్ , కమల్ హసన్ వంటి స్టార్ హీరోల సినిమాలో కథానాయికగా నటించింది. రెండు దశాబ్దాలపాటు స్టార్ హీరోయిన్ గా అలరించిన మీనా…2009లో బెంగళూర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకున్నారు. కెరీర్ పీక్స్ స్టేజ్ లో పెళ్లి చేసుకొని సినిమాలకు ఆమె దూరమైంది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే గత ఏడాది జూన్ లో ఈమె భర్త మృతి చెందాడు. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది మీనా.
ఇదిలా ఉండగా మీనా ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఓ తమిళ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్ళికి ముందు ఒక హీరో అంటే క్రష్ ఉండేదని.. అతన్ని ప్రేమించానని, ఆ హీరోని పెళ్లి చేసుకుంటానని ఆమె అమ్మతో కూడా చెప్పిందట. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అని బయటపెట్టింది.
పెళ్ళికి ముందు హృతిక్ రోషన్ ను చాలా ప్రేమించానని, తనకు హృతిక్ రోషన్ లాంటి వ్యక్తి భర్తగా కావాలని అమ్మతో చెప్పానని మీనా చెప్పుకొచ్చారు. అయితే హృతిక్ రోషన్ కి 2000వ సంవత్సరంలో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి వార్త విన్న తనకు గుండె పగిలినంత పని అయ్యిందని… అప్పటికి తనకు ఇంకా పెళ్లి కాలేదని మీనా వెల్లడించింది. ఆ తరువాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకుంది.
Also Read : రెండో పెళ్లికి మీనా గ్రీన్ సిగ్నల్ – వరుడు అతనే