నేరస్తులను మార్చే మెకానిక్ షెడ్ లు జైళ్ళు! కానీ అ జైళ్ళు కూడా చివరికి నేరస్తులకు అడ్డాలుగా మారితే దానికి భాద్యులు ఎవరు? ఎవరి కాలర్ పట్టాలి? ఎవరిని అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టాలి? ఉత్తరప్రదేశ్ అవినీతి, అక్రమాలకు నాడు అడ్డాలాంటిది. చివరికి నేడు జైళ్ళు కూడా అడ్డాలుగా మారాయి. బీఎస్పీ నాయకుడు ముఖ్తార్ అన్సారి పెద్ద గ్యాంగ్ స్టర్. అతను చేసిన నేరాలకు శిక్ష వేయాలంటే 230 ఏళ్ళు కూడా సరిపోవు. ఇది ఓ కేసులో అరెస్ట్ చేసి చిప్ప కూడు తినిపిస్తోంది.
ఈ తండ్రి ఏక్ నెంబరి అనుకుంటే ఇతని కొడుకు అబ్బాస్ అన్సారి దస్ నంబరి. అబ్బాస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇతను తండ్రిని మించిన గ్యాంగ్ స్టర్. ఇతను కూడా మరో జైలులో చిప్ప కూడు తింటున్నాడు. ఇతనికి కూడా బుద్ది రాలేదు. తండ్రి లాగే జైలులో ఉంటూ చక్రం తిప్పుతున్నాడు. అతను చేసే అన్నిరకాల నేరాలు ఇక్కడినుంచే మొదలవుతాయి.
దీనికి అసలు కారణం ఇతని భార్య నిఖిత్. ఇవిడ సవ్ నెంబరి. ఇవిడ పెద్ద కరోడా. ఆమె మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. పెద్ద కేసని పేరుంది. కాకపోతే జైలు బయటి గోడలమధ్య ఉంటోంది. ఓ లేడి కానిస్టేస్తేబులాగా ములాకాత్ పేరుతో రోజు జైలుకి వస్తుంది. ఆరు, ఏడు గంటలు మొగుడితో గడుపుతుంది. ఇంటినుంచి నాన్ వెజ్ క్యారేజి తెస్తుంది. బయటి విషయాలు మొగుడికి చెపుతుంది. ఏం చేయాలో తెలుసుకుంటుంది. తన సెల్ ఫోన్ తో అందరిలో మాట్లాడిస్తుంది. బెదిరిస్తుంది. ఇంటికి వెళ్లి వాటిని ఆచరిస్తుంది.
తప్పు ఆ ముగ్గురుది కాదు. అంతకు మించిన క్రిమినల్స్ జైలు అధికారులది. లంచాలకు మరికి ఇలాంటి ఎదవాలతో చేతులు కలిపారు. పండు పండి ఏదో ఒకరోజు నెల మీద రాలుతుంది. పాపం కూడా ఏదో ఒకరోజు పండుతుంది. మీడియా ద్వార విషయం బయటికి పొక్కింది. అంతే! జైలు అధికారులు అశోక్ సాగర్, సుషీల్ కుమార్ మీద వేటు పడింది. రోజు జైలుకు వచ్చే నిఖత్ మీద, ఆమె కార్ డ్రైవర్ మీదకు చర్యలు తీసుకోడానికి చర్యలు మొదలయ్యాయి.