పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు కరువై…పెళ్లి కాని ప్రసాద్ లా తయారవుతున్నారు అబ్బాయిలు. మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయిస్తూ ఎదో ఒక రకంగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకక పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు సతమతం అవుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను లైన్ లో పెట్టేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఇద్దరితో సంసారం చేశాడు. ఇద్దర్నీ తల్లులను కూడా చేశాడు. తాజాగా ఆ ఇద్దర్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు గిరిజన యువతులను వివాహమాడాడు. డిగ్రీ చదువుకునే రోజుల్లో మడివి సత్తిబాబు అనే యువకుడు దోసిల్లపల్లి గ్రామానికి చెందిన స్వప్న కుమారి, కున్నాపల్లి గ్రామానికి చెందిన సునీతలను ప్రేమించాడు. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా సత్తిబాబును ఇష్టపడ్డారు. దాంతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. కొన్నాళ్ళ తరువాత విషయం ఆయా కుటుంబాలకు తెలియడంతో పెద్ద గొడవలే జరిగాయి. ఇద్దరు అమ్మాయిలు మాత్రం తాము పెళ్ళంటూ చేసుకుంటే సత్తిబాబునే చేసుకుంటామని పట్టుబట్టడంతో మూడు కుటుంబలకు చెందిన కుటుంబ సభ్యులు మాట్లాడుకొని స్వప్న కుమారి, సునీతలను సత్తిబాబుకు ఇచ్చి పెళ్లి చేశారు.
గత కొంతకాలంగా ఈ ముగ్గురు సహజీవనం చేస్తున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో తాజాగా గిరిజన సంప్రదాయం ప్రకారం ఎర్రబోరు గ్రామంలో వివాహం చేశారు. ఇదిలా ఉండగా సత్తిబాబుతో సహజీవనం చేసిన యువతులిద్దరికీ చెరొక సంతానం కలిగినట్లు సమాచారం.
Also Read : 13ఏళ్ల బాలుడితో 31ఏళ్ల మహిళా లైంగిక సంబంధం- గర్భం దాల్చడంతో కాస్త..!