ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు మారిది బిఆర్ఎస్ ఓవర్ ఆక్షన్. బిఆర్ఎస్ ఈ మధ్య మొదలు పెట్టిన ఆత్మీయ సమ్మేళనం అమాయకుల పాలిట శాపంగా మారింది అని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. నిన్న ఉచిత భోజనం కోసం జనం కొట్టుకున్నారు. రక్తపాతం జరిగింది.
అది మరువక ముందే ఈ రోజు ఇద్దరు చనిపోయారు, ఆరుగురి పరిస్టితి విషంగా ఉంది. వివరాల్లోకి వెళ్ళితే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఏదో ఘన విజయం సాదించినట్లు కార్యకర్తలు విచ్చలవిడిగా బాణాసంచా కాల్చారు. అక్కడ ఎవరున్నారు? చుట్టు పక్కల గుడిసెలు ఉన్నాయా? లేవా అని కూడా చూడలేదు. నిప్పు రవ్వలు పూరి గుడిసె మీద పడ్డాయి. అందులోని గ్యాస్ సిలిండర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది.
నలుగురు వ్యక్తుల కాళ్ళు తెగిపడ్డాయి. ఒకరి కడుపు లోనుంచి పేగులు బయటికి వచ్చాయి. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దుర్గటనలో గాయపడిన బాధితులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది పరిసితి విషమంగా ఉందని డాక్టర్ లు తెలిపారు. ఇద్దరు వెంటనే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
వైరా నియోజకవర్గ టిపిసిసి నాయకుడు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, అందుకు అయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసారు. అలాగే ఈ సంఘటనపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో చీమలపాడు గ్రామాన్ని మాంసపు ముద్దలగా మార్చిన వారు ఎవరైనా సరే, తక్షణమే రాజీనామా చేయాలని, చనిపోయిన వారి కుటుంబాలకు రెండు కోట్ల రూపాయల చొప్పున ఎక్స్ గ్రే షియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క బాధిత కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని, కుటుంబానికి ఒకరి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు వహించాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్ దిగ్బ్రాంతి
ఈ వార్త వినగానే కెసిఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికీ వెంటనే మెరుగైన వైద్యం చేయించాలని కలెక్టర్ ని ఆదేశించారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు, గాయపడిన వాళ్ళ కుటుంబాలకు నష్ట పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.