ముహమ్మద్ ఫక్రుద్దీన్ జునా ఖాన్గా పిలువబడే ముహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప రాజకీయ మేధావి. అతని తెలివితేటలు, చాణక్య నీటిని ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. కానీ ఆయన జీవతంలో చేసిన ఒకే ఒక్క తప్పు రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి కి మార్చడం. ఢిల్లీ నుండి 700 మైళ్ళ దూరాన దక్కనులో వున్న దేవగిరిని, దౌలతాబాదుగా పేరుమార్చి రాజధానిగా ప్రకటించాడు.
తన ప్రభుత్వకార్యాలయాను మాత్రమే మార్చక, మొత్తం ప్రజానీకం దౌలతాబాదుకు మకాం మార్చాలని హుకుం జారీ చేశాడు. దౌలతాబాదులో ప్కరజలకు కనీస వసతులు కూడా అందిచలేకపోయాడు. కేవలం రెండేండ్లలో, తిరిగీ రాజధానిగా ఢిల్లీని ప్రకటించి, ప్రజలందరూ తిరిగీ ఢిల్లీ చేరాలని ఆజ్ఞలు జారీచేశాడు. ఈ అసంబద్ధ నిర్ణయానికి బలై, వలసలతో ఎందరో జనం మరణించారు. ఈ రెండేళ్ళకాలం ఢిల్లీ “భూతాల నగరంగా” మారిందని చరిత్రకారులు చెబుతారు. దాంతో అతని చరిత్ర ముగిసింది.
అప్పటినుంచి అతను ‘పనికిమాలిన రాజుగా’ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. 1325 నుంచి ఇప్పటివరకు ‘తుగ్లక్’ అంటే ‘వెర్రి బాగులోడు’ అనే నిక్నేమ్ శతాబ్దాలుగా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇద్డదు తుగ్లక్ లు ఉన్నారు అని జనం అంటున్నారు. ఆ ఇద్దరు జగన్, చంద్రబాబు నాయుడు అని మీకు ఈ పాటికి అర్థమయి ఉంటుంది. ఈ ఇద్దరిలో కొంచం తెలివున్న ‘తుగ్లక్’ ఒకరు. తన తప్పులను తాను తెలుసుకోగలడు. కానీ ఆ తెలివి కూడా లేని మరో ‘తుగ్లక్’ కూడా ఉన్నాడు. తాను ఏ తప్పు చేయలేదని ఇంకా నమ్ముతారుడు.
గత ఎన్నికలలో చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడో అతనికి ఇప్పటికి అర్థం కాదు. ఆయన చుట్టూ ఉండే చెక్క భజన పరులకు అంతకంటే అర్థం కాదు. ఎవరైనా చెపితే వాడినే ‘తుగ్లక్’ గా చూస్తారు. అమరావతిని రాజధానిని చేసి బాబు చేతులు కాల్చుకుంటే, ఇప్పుడు జగన్ ఏకంగా మూడు రాజధానులు కడతాము అని ప్రకటించి చేతులు, కాళ్ళు, నాలుక కాల్చుకుంటున్నారు. ఇద్దరు ప్రజల దృష్టిలో మరో ‘తుగ్లక్’లా మారారు. దొందు దొందే.
ఈ ఇద్దరు ఓ నిజాన్ని అర్థం చేసుకోవాలి. రాజధాని ఓ ఇల్లు కాదు. కట్టడానికి. అది కొండలాంటిది. ప్రకృతి సహజంగా ఏర్పడాలి. ఇల్లు కట్టినట్లు కొండను కడతాను అనే వాళ్ళను ‘తుగ్లక్’ అనక మరేమనాలి?
‘మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి’ అన్నట్లు ఒకప్పుడు రాజధానిగా ఓ వెలిగి వెలిగిన ‘అమరావతిని’ మళ్ళి రాజధానిగా చంద్రబాబు నాయుడు అలియాస్ ‘తుగ్లక్’ ప్రకటించారు. కూర్చున్న బుద్దుడి విగ్రం తప్పా అక్కడ ఏముంది? అని పారిశ్రామిక వేత్తలు అడిగితే జవాబు లేదు. పచ్చటి పొలాలు ఉంటే ఉండవచ్చుగాకా. అలాంటి పొలాలు ఈస్ట్, వెస్ట్ గోదావరిలో లేవా? అమరావతిని రాజధానిగా మార్చడమంటే, మా తాత పన్నెండు మంది పిల్లలను కన్నాడు, కాబట్టి 99 ఏట మరోసారి పడుచు పిల్లతో పెళ్లి చేస్తాను అన్నట్లు లేదు?
నాటి చక్రవర్తులు కూడా రోమ్ నగరాని కొత్తగా నిర్మించలేదు. ఉన్న నగరాని విస్తరించారు. రాజధాని అంటే అదీ లెక్కా. ఒక్కముక్కలో చెప్పాలంటే సహజసిద్దంగా ఎక్కువ జనాభా కలిగి, ఎక్కువ పరిశ్రమలు ఉంది, ఎక్కువ ఆధా యాన్ని (రెవిన్యు) సంపాదించి పెట్టేదే రాజధాని. ఒక దేశంలో ఎన్నో నగరాలూ ఉంటాయి. కానీ అందులో ఒక్క నగరమే సహజసిద్దంగా ఎక్కువ జనాభా కలిగి, ఎక్కువ పరిశ్రమలు ఉంది, ఎక్కువ ఆధాయాన్ని సంపాదించి పెడుతుంది. దానిని ఆటోమేటిక్ గా రాజధానిగా పిలుస్తారు. దానిని ఒకరు నిర్మించేది కాదు. ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఇదే జరిగింది. కొండను కట్టిన ధాకలాలు, రాజధానిని కట్టిన ధాకలాలు లేవు. అందుకే ఎవ్వరు కొండను కట్టాలని ఆలోచించారు.
ఇంత చిన్న లాజిక్ మరిచిన ముహమ్మద్ బిన్ తుగ్లక్ చావు దెబ్బతిని చారిత్రాత్మక తప్పు చేశాడు. వెర్రి బాగులోడిలా చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు. ఆ పాటాలను బడిలో నేర్చుకున్న మన నాయకులు గుణపాటం నేర్చుకోలేదు. మళ్ళి అలాంటి తప్పులు చేయడం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లో సహజ సిద్దంగా ఎక్కువ జనాభా కలిగి, ఎక్కువ పరిశ్రమలు ఉంది, ఎక్కువ ఆధాయాన్ని సంపాదించి పెట్టే ఏకైక నగరం విశాకపట్ట్నం. దానినే రాజధానిగా చేయాలనీ రాజకీయపండితులు, చివరికి కెసిఆర్ లాంటి వాళ్లు కూడా చంద్రబాబుకు నాడు సలహా ఇచ్చారు. కానీ చంద్రబాబు ‘రాజకీయం’ వేరు. ముందుగా తక్కువ ధరలో భూములు కొని, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రకటించి రియల్ ఎస్టేట్ ని పెంచుకున్నారు. మళ్ళి అదే స్కీంలో ముందుగా అమరావతిలో తక్కువ ధరలో భూములు కొని, ఆ తర్వాత దానినే రాజధానిగా ప్రకటించారు.
దానిని సరిగ్గా అర్థం చేసుకున్న జగన్ ఆ ఎత్తును చిత్తు చేసారు. మూడు రాజధాననులల్లో ఒక దానిని విశాకాపట్టణం చేయడం మంచిదే. కానీ దానికి రెండు తోకలు పెడుతూ మరో రెండు రాజధానులు కూడా కడతాను అనడంతో మరో తుగ్లక్ లా మారాడని జనం ఎద్దేవ చేస్తున్నారు. అసలు రాజధాని విషయం ఎప్పుడో తప్పుదోవ పట్టింది. ఇప్పుడు జరిగేది కేవలం రాజకీయ కక్షలు, పగలు, ప్రతీకారాలు మాత్రమే.
రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కెసిఆర్ ఓ చక్కటి మాట అన్నారు. ‘ఆంధ్ర రాజకీయ నాయకులకు రాజధాని అంటే మీనింగ్ తెలియదు. దాని స్పెల్లింగ్ కూడా రాదు. అందుకే ఆనాడు మద్రాస్ నుంచి పంపిస్తే హైదరాబాద్ కి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పంపిస్తే అమరావతికి వెళ్లారు. ఇక వందేళ్ళవరకు కూడా రాజధాని నిర్మించుకోలేరు’ అని.
ఆ మాటలు ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలు విడిపోయి తొమ్మిదేళ్ళు కావస్తున్నా ఇంకా రాజధాని కట్టుకోలేకా, కొట్టుకునే జగన్, బాబులను చూసి తుగ్లక్ కి వారసులు వచ్చారని జనం నవ్వుకుంటున్నారు.
౦౦౦