గద్దకు దాన వేయకు పుణ్యమే. కానీ కాకులను చంపి వేయడం పాపం. దుమ్ము దూలి తగ్గించాలంటే నగరంలోని రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రాథనా మందిరాలు కూల్చే చట్టాన్ని తీసుకు వస్తామని కేటిఅర్ శాసనసభలో ప్రకటించారు. ఇక ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే రోడ్డు మీద ఉండే ప్రార్ధన మందిరాలు కుల్చాలి అని బిఆర్ఎస్ లోగడ చూసింది. దానిని బిజెపి అడ్డంగా వాడుకుని నగరంలో కార్పొరేట్ ల సంఖ్యను పెంచుకుంది. ఇప్పుడు ఆ నినాదాన్ని మార్చారు. దుమ్ము దూలి తగ్గించడానికి అని కొత్త నినాదం ఎత్తుకున్నారు. ప్రార్ధన మందిరాల ద్వార దుమ్ము దులి ఎలా వస్తుది? ఆవి సిమెంట్ ఫ్యాక్టరీ లా? కేమికాల్ ఫాక్టరీ లా?
ప్రార్ధన మందిరాలు మన దారికి అడ్డంకుāలు కాదు. మన మతాలకు, మన విశ్వాసాలకు, మన సంస్కృతికి రహదారులు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యలను ఎలా తగ్గించాలి అని అడిగితే – మంచం పట్టిన బామ్మను ముందు చంపండి అన్నట్లు ఉంది. ఆ బామ్మా వల్లే మన కుటుంబం ఏర్పడింది. చార్మినార్ నీ చూసేందుకు వచ్చే టూరిస్ట్ లు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి – చార్మినార్ నీ కూల్చితే సమస్య తీరుతుంది అనుకుంటున్నారు. కానీ చార్మినార్ కట్టినందుకే టూరిస్ట్ లు వస్తున్నారు అని మరువకండి.
ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే నగరంలో రోడ్డుకు అక్రమ కట్టడాలు ముందుగా కుల్చాలి. కానీ కుల్చరు. ఓటర్లు ఓట్లు వేయరు కాబట్టి. పుట్ పాట్ల మీద వెలసిన బళ్ళను, డబ్బాలను పికేయాలి. కానీ అలా పిక్తే ట్రాఫిక్ పోలీసులకు రోజు వచ్చే కోట్లాది రూపాయల మాముల్లు రావు. ఇక మిలింది ఎవరు? దేవుళ్లు. రాముడికి ఓటు హక్కు లేదు. అల్లాకు ఆదార్ కార్డ్ లేదు. జిసేస్ పేరు ఓటర్ల లిస్టు లో లేదు. కాబట్టి వీటి మీద పడ్డారు. ఇక ఓట్లు తగ్గవు. ఇది కుట్ర.
నిజంగా అక్రమ కట్టడాలు కుల్చాలంటే ముందుగా కుల్చవలసింది ప్రగతి భవన్. దానికి ఎలాంటి పర్మిషన్లు లేవు. కానీ అది ఎందుకు కులుచుతారు? నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే చాలా మార్గాలు ఉన్నయి. అందులో మొదటిది సిఎం, 32 మంత్రులు వెళ్లే తప్పుడు నగరంలో ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ ను ఆపేస్తారు. అది కూడా అర్థ గంటకు పైనే. దాంతో ట్రాఫిక్ ఏర్పడుతుంది. ముందు మీరు రోజంతా తిరగడం మానండి. లేదా సగటు వాహన దారుడిలా అందరితో కలిసి ప్రయాణించాలి. మీవల్ల అంబులెన్స్ లు ఆగి ఎందరో రోగులు చనిపోయిన సందర్బాలు ఉన్నాయి. నగరంలో ఫ్లై ఓవర్, ఓవర్ ప్లయ్ బ్రిడ్జి లు కట్టండి. భూగర్బ మార్గాలు నిర్మించాలి. రొడ్ల వెడల్పులు పెంచాలి.