నిన్నటివరకు తనకు ‘డిల్లీ లిక్కర్ స్కాం’ తో ఎలాంటి సంబంధం లేదని ఎం ఎల్ సి కవిత బుకాయించారు. ఇప్పుడు ఈడి సమన్లు అందుకున్నారు. ఈ కేసులో ఆమె తన పేరు రాకుండా ఇప్పటివరకు చేసిన అన్నీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కెసిఆర్ తన కూతురిని కాపాడుకోవాలని తిప్పిన రాజకీయచక్రం ఎట్టకేలకు తిరగకుండా వెనక్కి వచ్చింది. ఇద్దరికీ దాదాపు అన్ని దారులు ముసుకున్నాయి.
మనీలాండరింగ్ చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) బుధవారం హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్ళైని అరెస్టు చేసింది. ఇతను దక్షిణ భారత్ ఆధారిత మద్యం తయారీదారుల సమూహం ‘ఇండోస్పిరిట్స్ ‘లో ఒక భాగస్వామి. ఇందులో ఇతని పాత్ర ఏంతో కీలకం. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వంద కోట్ల విలువైన ‘కిక్బ్యాక్లు’ పంపినట్లు ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. ఇతను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రధాన నిందితుడు. దక్షిణ భారతదేశానికి చెందిన నాయకుల బృందాన్ని కలిగిన ‘సౌత్ గ్రూప్’లో ఇతను ఎంతో కీలక సూత్రదారి. ఈడీ చెప్పిన ఆదరాల ప్రకారం అతనికి కంపెనీలో 32.5% వాటా ఇవ్వబడింది.
అరుణ్ రామచంద్ర పిళ్ళైని నిన్న ఈడి ముందు చాలా నిజాలు బయటపెట్టారు. అందులో ప్రధానమైనది తాను కవితకు బినామిని అని చెప్పారు. అతను ఇప్పటివరకు చేసినదంతా కవిత ఆదేశాల మేరకు చేసినట్లు, ఆమెనే దీనికి మూలసూత్రదారి అని చేతులు ఎత్తేశారు.
అందుకే ఈడి బుధవారం కవితకు సమన్లు జారీచేసింది ఈడి. ఈ నెల 9, 10 తేదీలల్లో విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించింది. అయితే ఆమె బిజీగా ఉన్నందునా ఆ తేదీలల్లో పాల్గొలేనని, 11 తేదిన పాల్గొంటానని వాళ్ళ మీద దయతలచి అపాయింట్మెంట్ ఇచ్చారు కవిత.
ఆమెను ఈడి పిలిచింది పెరంటానికా? ఆమె వీలుచుకుని వచ్చేందుకు ఇది ‘వైన్ షాప్’ ఓపెనింగా ? ఆమె ఒక ఎం ఎల్ సి అని మరిచి ముఖ్య మంత్రిగానో, ప్రధానిగానో భావించడం దౌర్భాగ్యం. ఆమె దేశాన్ని ఉద్దరించడానికి ఢిల్లీలో ఏం చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి చిల్లర వేషాలే ప్రతిపక్షాలకు తిట్టేందుకు అవకాశాలు కల్పిస్తాయి. లోగడ సిబిఐ విచారణకు పిలిస్తే ఇలాగే వాయిదాలు వేసి వాళ్ళ సహనాన్ని పరీక్షించారు. చివరికి అరెస్ట్ వారెంట్ జారి చేస్తామని గట్టిగా బెదిరించడంతో ఆమె వాళ్ళ కార్యాలయానికి వెళ్లరు.
ఇప్పుడు కూడా అదే పరిస్టితి తలెత్తేలా ఉంది. నేరస్తులకు, నిందుతులకు చట్టంలో కొన్ని వేసులుబాటులు ఉంటే ఉండవచ్చుగాకా. కానీ వాటిని కవిత తన అవసరానికి వాడుకోవడం ఆమె ‘క్రిమినల్ బుద్దిని’ మరోసారి బయట పెట్టింది అని కాంగ్రెస్ దుమ్మేతిపోసింది. ఆమె నిర్దోషి అని ఈడి ప్రకటించాలి. నిజంగా ఆమె తప్పు చేయకపోతే నిర్భయంగా విచారణకు హాజరయ్యి తాను నిర్దోషినని రుజువు చేసుకోవాలి. అది పక్కన పెట్టి తనకు తాను మంచిదానిని అని బోనాఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చుకుని, తాను నిర్దోషిని అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఏమిటని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. దీనికితోడు న్యూ ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర ఆందోళన చేయడం ఏమిటని కాంగ్రెస్ ఘాటుగానే నిలదీసింది.
ఎన్నడూ లేనిది ఇప్పుడు తగుదునమ్మ అన్నట్లు ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ కొత్త నినాదం పట్టుకున్నారు. ఈ కేసుని పక్కదోవ పట్టించాలనే ఈ కొత్త డ్రామా అని మండిపడ్డారు. అంతమాత్రానా ఆమె నిర్దోషి అని జనం ఎలా నమ్ముతారు? దెయ్యం వేదాలు వల్లిస్తే ఎవరు వింటారు? అని కాంగ్రెసే కాదు, ప్రజలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇలాంటి చిల్లర వేషాలు మగవాళ్ళు వేయడం వల్లే, వాళ్ళ మీద గౌరవం పోయింది. ఇప్పుడు మహిళలు కూడా ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే మగాళ్ళకు, ఆడవాళ్లకు తేడా ఏమిటి? అని నిలదీస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినం రోజుకూడా ఓ మహిళా ఇలా వక్ర బుద్ది చూపడం ఎంతవరకు భావ్యం అని జనం నవ్వుకుంటున్నారు.