లోగడ ఉమ్మడి ఏపిలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వలేని వై ఎస్ రాజశేఖర రెడ్డి ‘అవుట్ సోర్స్’ అనే కొత్త పథకం పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు అలాంటి పద్దతిని ఏ పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా అమలు చేస్తూ ‘వలంటీర్ల’ విధానం మొదలు పెట్టారు. వీళ్ళు ఎవరో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రతి గ్రామంలో తన పార్టీ కార్యకర్తలకు ‘వలంటీర్ల’ ఎరను వేసి యువతను, నిరుద్యోగులను అడ్డంగా ఇరికించారు. వీళ్ళకు అన్ని అధికారాలు అంటగట్టారు. ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలపైన గ్రామాలల్లో ‘వలంటీర్ల’దే పెత్తనం. వాళ్లు అడిగినంతా ఇవ్వాలి, చెప్పినట్లు చేయాలి. దానితో ప్రజల కష్టాలు క్రమంగా ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు చెపితే ఎవ్వరు పట్టించుకోలేదు.
చిలికి చిలికి గాలివానల ఇది హై కోర్టు మెట్లు ఎక్కింది. రాజకీయ కారణాలతో అర్హుల జాబితా నుంచి తొలగించారంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్. వసంతలక్ష్మితోపాటు మరో 26 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిమీద లోతుగా అద్యాయనం చేసిం హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ‘వలంటీర్ల’ సిస్టం మీద పెదవి విరిచారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు అర్హతను నిర్ణయించే అధికారం వలంటీర్లకు ఎక్కడిదని ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ శాఖలు అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కాని ప్రైవేటు వలంటీర్లను ఎందుకు వినియోగిస్తున్నారు? అని ఘాటుగా నిలదీశారు. వలంటీర్లకు సర్వీసు నిబంధనల్లేవని.. ఆ వ్యవస్థకున్న చట్టబద్ధత ఏంటని ఘాటుగా నిలదీసారు.
దీనికి జవాబుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ మాత్రం దీనికి భిన్నంగా కౌంటర్ వేశారు. లబ్ధిదారులను గుర్తించేందుకు వలంటీర్లను వినియోగిస్తున్నామని తోకా తొండం లేని జవాబు చెప్పారు. ఇందుకు ఆరు అంచెల విధానాన్ని అనుసరిస్తున్నాం అని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ ఫిబ్రవరి 28న స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు. చూడాలి….జగన్ సర్కార్ ఈ అనధికారిక ‘వలంటీర్ల’ను ఎలా కాపడుకుంటుందో.
Also Read : ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పట్టాభి సై – అందుకే కుమ్మేశారా..?