తెలంగాణలో మరో పార్టీ ఏర్పాటు కానుంది. తెలంగాణ నిర్మాణ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తీన్మార్ మల్లన్న ఆ పార్టీకి అద్యక్షుడిగా వ్యవహరించనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి తీన్మార్ మల్లన్న దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా పార్టీ పేరు రిజిస్టర్ చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం షురూ అయింది. ఇందులో భాగంగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20వ తేదీలోపు తెలిజేయాలని ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.
ఏప్రిల్ లో కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసిన మల్లన్న అప్పుడే తాను వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మల్లారెడ్డిని ఓడించి తీరుతానన్నారు. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ లో మల్లారెడ్డి ఇష్యూను ప్రస్తావిస్తూ.. ఆయన కబ్జాల బాగోతాన్ని బయటపెడుతూ మేడ్చల్ వాసులకు మరింత దగ్గర అవుతున్నారు. కొంతకాలంగా మల్లన్న కాంగ్రెస్ తో సఖ్యత మెయింటేన్ చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని ఇటీవల వాదనలు వినిపించాయి.
తాజాగా మల్లన్న సారధ్యంలోని తెలంగాణ నిర్మాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన సొంత పార్టీ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది.
Also Read : మేడ్చల్ నుంచి కోదండరాం – తీన్మార్ మల్లన్నపై కుట్ర..?