ఈ వార్త చదివే ముందు ఓ జోక్ చదివి నవ్వుకోండి. స్కూల్ పిల్లలతో పాటు చంటి జూ పార్క్ కి వెళ్ళాడు. అంతలో పులి బోనులోంచి తప్పించుకుంది. అందరు భయపడి చెట్ల వెనక భయంతో నక్కారు. ఇంట్లో ఉన్న చంటి తల్లికి ఈ వార్త తెలిసి వెంటనే ఫోన్ చేసి ”ఎక్కడున్నావురా?’ భయంతో అడిగింది. చంటి నవ్వి ”పులి బోనులో దాక్కున్నాను. డోంట్ వర్రీ” అన్నడు.
ఈ కామెడీ ప్రాక్టికల్ గా జరిగింది. గతకొన్ని రోజులుగా ఉత్తెర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఓ చిరుత పులి జనావాసాల మీద దాడులు చేస్తోంది. దానిని పట్టుకోడానికి అటవీశాఖ నానా తంటాలు పడుతోంది. కొన్ని బోనులను చుట్టూ పక్కల ప్రాంతాలల్లో పెట్టింది. అందులో చిరుత పులికి ఎరగా కోళ్ళను పెట్టింది. ఈ విషయం తెలియని ఓ దొంగ ఆ కోడిని దొంగిలించాలని బోనులోకి మెల్లిగా దూరాడు. ఆ బోనుకు ఆటోమాటిక్ లాక్ అయ్యింది. అతను అందులో చిక్కగానే హరన్ లు మోగాయి. చిరుత దొరికింది అని సంతోషించి సిబ్బంది అక్కడ్కికి తుపాకులతో వచ్చారు.
కోడిని దొంగతనం చేయబోయినట్లు చెపితే కొడతారని ”పులికి దొరకక కుండా ఇందులో దాక్కున్నాను సార్” అని తెలివిగా జవాబు చెప్పాడు. అదండీ! మనిషి తెలివి తేటలు. మరి అంత తెలివున్న ఆ దొంగ బోనులో ఎలా చిక్కడో?
౦౦౦