ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడంతా ఒకటే చర్చ. పవిత్ర , నరేష్ లు జంటగా ఓ లవ్ స్టొరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
వీరిద్దరూ ఇంతకుముందు పలు సినిమాల్లో కనిపించారు. భార్య భర్తలుగా, అన్న చెల్లెళ్ళుగా నటించారు. మొదటి సారి హీరో , హీరోయిన్ గా ఓ లవ్ స్టొరీ సినిమాలో నటించనున్నారని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కథ కూడా సిద్దమైందని, ఈ సినిమా కథను వీరిద్దరికీ వినిపించగా ఒకే కూడా చెప్పారని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
నరేష్ , పవిత్రలు ప్రస్తుతం కలిసే ఉంటున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతకుముందు వీరిద్దరూ ఓ హోటల్ లో సహజీవనం చేస్తూ నరేష్ భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే.