”ఆప్ ఈట్ తో మారేతో హమ్ పత్తర్ సే మారింగే” అన్నది బిజెపి నినాదం. అంటే మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాము అన్నది అర్థం. లోగడ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కి వచ్చినప్పుడు వాళ్ళను అవమానపరుస్తూ బిఆర్ఎస్ కొన్ని వాల్ పోస్టర్ లు అతికించింది అనే ఆరోపణలు ఉన్నాయి.
దానిని మనసులో పెట్టుకున్న బిజెపి దానికి ప్రతీకారంగా ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’ లో ఇరుక్కున్న ఎమ్మెల్సి కవితను అవమానపరుస్తూ హైదరాబాద్ నగరం నిండా వాల్ పోస్టర్లు అతికించింది అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది బిజెపి చేసిన పని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వీటిమీద ఎవ్వరి పేరు లేదు.
ఈ వాల్ పోస్టర్ లు వాషింగ్ పౌడర్ నిర్మా, టైడ్ వ్యాపార ప్రకటలను పోలి ఉన్నాయి. ఒక పోస్టర్ లో మద్యం సీసాలు, కవిత నవ్వుతున్న ఫోటోతో కూడిన ఒక పోస్టర్ దర్శనమిస్తోంది. అందులో.. ”కవితక్కా నీకు కావాలి సారా దందాలో 33శాతం వాటా. దాని కోసమే ఆడుతున్నావు 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆట” అన్న క్యాప్షన్ తో కూడిన పోస్టర్ దర్శనమిస్తోంది.
మరో పోస్టర్ లో ఎమ్మెల్సీ కవిత ఫోటోతో, మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఈడీ ఎంబ్లమ్ ముద్రించి, దానికి క్యాప్షన్ గా ”తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని, ఢిల్లీలో కవితక్క చేస్తుంది దొంగ సారా దందా” అని పేర్కొన్నారు.
మరో పోస్టర్ లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాను పోలి ఉన్న పోస్టర్ లో కవిత ఫోటోను పెట్టి.. ‘కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే.. మద్యం’ అంటూ పంచ్ వేసే పోస్టర్ గోడల మీద దర్శనమిస్తోంది. అంటే ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్” అని అర్థం.
వీటి ఫిలాసఫీ ఒక్కటే. కేంద్ర విచారణ సంస్థలతో మోడీ సర్కారు ఒత్తిళ్లు తెచ్చి ఎందరినో మార్చారు కానీ. కవితను మాత్రం ఇంకా మార్చలేరు. ఆమె మీద ఒత్తిళ్లు పని చేయవన్న రీతిలో పోస్టర్లు ఉన్నాయి. కానీ రెండోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్న కవితను ఉతికి ఆరేస్తారు అనే అర్థం దాగి ఉంది.
దీని వెనుక సూత్రధారి ఈటెల రాజేందర్?
దీని వెనుక సూత్రధారి ఈటెల రాజేందర్ ఉన్నాడు అని బిఆర్ఎస్ అధినేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే లోగడ ఈటెల రాజేందర్ భూకబ్జాల కుంభకోణంలో ఇరుక్కున్నప్పుడు కెసిఆర్ అవమానపరిచి పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటికే ఈటెల రాజేందర్ కు కవిత గురించి బాగాతెలుసు. ఆమె రాజకీయ మనుగడ మొత్తం అతని కళ్ళముందే జరిగింది. ఆ మాటకొస్తే న్యూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను ముందుగా ప్రోత్సహించింది కూడా ఈటెల రాజేందర్ అనే పుకార్లు ఉన్నాయి.
కాబట్టి ఈటెల రాజేందర్‌కి ఈ స్కాం గురించి అంతా తెలుసు. అందుకే బిజెపి లోకి వెళ్ళగానే కెసిఆర్ మీద పగ సాదించేందుకు కవితను కావాలని ఈ స్కాం కు ముహూర్తం పెట్టింది కూడా ఈటెల రాజేందర్ అనే పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకే ఈటెల రాజేందర్ కావాలనే తెరవెనుక ఉంది ఈ వాల్ పోస్టర్ లు అతికింపజేసాడు అని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.
Also Read : కవితకు బిగ్ షాక్ – ఈడీ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్న ప్రభుత్వ పెద్దలు