మనుషులు రోజురోజుకు మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. వావివరసలు పక్కనపెట్టేసి వివాహ బంధంతో ఒకటి అవుతున్నారు. హిందూ సంప్రదాయంలో అన్నా- చెల్లెళ్ళ బంధాన్ని అందరూ గౌరవిస్తారు. ప్రేమిస్తారు. అన్నా- చెల్లెళ్ళలో ఒకరంటే ఒకరికి అనంతమైన ప్రేమ, అభిమానం ఉండి ఉంటుంది. అన్నయ్యపై చూపే ప్రేమకు కానుకగా చెల్లికి మంచి వరుడిని చూసి పెళ్లి చేయాలని అన్నయ్యలు తపిస్తారు. కాని ఓ మూర్ఖుడు కక్కుర్తిపడి సొంత చెల్లినే పెళ్లి చేసుకొని మానవ సంబంధాలను మంటగలిపాడు.
సొంత చెల్లిని ఓ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. కారణం.. ప్రభుత్వం నుంచి వచ్చే తాయిలాలను పొందేందుకోసం. సర్కార్ ఇచ్చే సాయం కోసం మనవ సంబంధాలను అపహాస్యం చేస్తూ సొంత చెల్లికి మూడు ముళ్ళు వేశాడు. ఇలాంటి వాడిని ఏం చేసినా తప్పు లేదంటూ అందరూ ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నజరానాల కోసం ఇంతటి దారుణానికి ఒడిగడుతాడా నీచుడు అంటూ “ఛీ” కొడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో నివాసముండే దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ పెళ్ళీడుకొచ్చిన వారే. ముందు ఆడపిల్ల పెళ్లి చేసి తరువాత కొడుకు చేయాలని అందరూ తల్లిదండ్రులు భావించినట్లే ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. ఈ క్రమంలోనే టుండ్లా బ్లాక్ ఏరియాలో సామూహిక వివాహాలు చేయాలని యూపీ సర్కార్ భావించింది. ఇందులో భాగంగా 51 జంటలను ఎంపిక చేసి వారికి ప్రభుత్వమే దుస్తులతో పాటు పెళ్లి ఖర్చులు, గృహోపకరణాలు అందజేసింది. వీటిని పొందాలనే ఆశతో సొంత పెళ్లికి మూడు ముళ్ళు వేసి వివాహ సంప్రదాయాలను, అన్న- చెల్లి బంధాన్ని మంటగలిపాడు.
ఆ నోటా, ఈ నోటా బయటకు ఈ విషయం రావడంతో అధికారుల వరకు చేరింది. పెళ్లి ఖర్చులు, గృహోపకరణాల కోసం చెల్లిని పెళ్లి చేసుకున్న అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన గతంలోనే జరిగినా ఇప్పుడు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.