• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » జగన్ జిత్తులమారి ఎత్తును చిత్తూ చేసిన ఏ పి హై కోర్ట్?
AndhraPradesh

జగన్ జిత్తులమారి ఎత్తును చిత్తూ చేసిన ఏ పి హై కోర్ట్?

Duriki Mohan RaoBy Duriki Mohan Raoఫిబ్రవరి 22, 2023Updated:ఫిబ్రవరి 22, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

లోగడ ఉమ్మడి ఏపిలో  ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వలేని వై ఎస్ రాజశేఖర రెడ్డి ‘అవుట్ సోర్స్’ అనే కొత్త పథకం పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు అలాంటి పద్దతిని ఏ పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా అమలు చేస్తూ ‘వలంటీర్ల’ విధానం మొదలు పెట్టారు. వీళ్ళు ఎవరో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రతి గ్రామంలో తన పార్టీ  కార్యకర్తలకు ‘వలంటీర్ల’ ఎరను వేసి యువతను, నిరుద్యోగులను అడ్డంగా ఇరికించారు. వీళ్ళకు అన్ని అధికారాలు అంటగట్టారు. ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలపైన  గ్రామాలల్లో ‘వలంటీర్ల’దే పెత్తనం. వాళ్లు అడిగినంతా ఇవ్వాలి, చెప్పినట్లు చేయాలి. దానితో ప్రజల కష్టాలు క్రమంగా ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు చెపితే ఎవ్వరు పట్టించుకోలేదు.

చిలికి చిలికి గాలివానల ఇది హై కోర్టు మెట్లు ఎక్కింది. రాజకీయ కారణాలతో అర్హుల జాబితా నుంచి తొలగించారంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్. వసంతలక్ష్మితోపాటు మరో 26 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిమీద లోతుగా అద్యాయనం చేసిం హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ‘వలంటీర్ల’ సిస్టం మీద పెదవి విరిచారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు అర్హతను నిర్ణయించే అధికారం వలంటీర్లకు ఎక్కడిదని ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ శాఖలు అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కాని ప్రైవేటు వలంటీర్లను ఎందుకు వినియోగిస్తున్నారు? అని ఘాటుగా నిలదీశారు. వలంటీర్లకు సర్వీసు నిబంధనల్లేవని.. ఆ వ్యవస్థకున్న చట్టబద్ధత ఏంటని ఘాటుగా నిలదీసారు.

దీనికి జవాబుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ మాత్రం దీనికి భిన్నంగా కౌంటర్ వేశారు. లబ్ధిదారులను గుర్తించేందుకు వలంటీర్లను వినియోగిస్తున్నామని తోకా తొండం లేని జవాబు చెప్పారు. ఇందుకు ఆరు అంచెల విధానాన్ని అనుసరిస్తున్నాం అని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ ఫిబ్రవరి 28న స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు. చూడాలి….జగన్ సర్కార్ ఈ అనధికారిక ‘వలంటీర్ల’ను ఎలా కాపడుకుంటుందో.

Also Read : ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పట్టాభి సై – అందుకే కుమ్మేశారా..?

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Duriki Mohan Rao
  • Website

Related Posts

పేదవాడికి కలెక్టరేట్‌ అంటే నమ్మకం రావాలి… ఉద్యోగులే ప్రభుత్వ ముఖచిత్రం: సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 30, 2026

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version