పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వరుస సినిమా షూటింగ్ లు, రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉండాల్సి రావడంతో పవన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ మధ్య ప్రారంభం కావాల్సిన తమిళ చిత్రం ‘వినోదయ్యా సీతం’ రీమేక్ షూటింగ్ వాయిదా పడింది.
‘వినోదయ్యా సీతం’ రీమేక్ సినిమా కోసం గత కొద్ది రోజులుగా పవన్ ప్రత్యేకమైన డైట్ తీసుకుంటున్నారు. స్లిమ్ గా కావాల్సి ఉండటంతో ఆయన స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయన ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
జనవరి వరకు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చి #OG మరియు వినోదయ్యా సీతం రీమేక్ డేట్స్ కేటాయించాడు. ఈ సమయంలో ఆయన డైట్ ఫాలో కావడంతో అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.
సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో వచ్చే నెల నుంచి చేపట్టాలనుకున్న వారాహి యాత్ర కూడా పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చేతిలోనున్న సినిమాలన్నీ ఫినిష్ చేసి ఎన్నికల కదనరంగంలోకి దూకాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.
పవన్ అనారోగ్యానికి గురైయ్యారని తెలుసుకొని జనసేనాని అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. అనారోగ్యం కారణంగానే తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వెళ్లలేదని అంటున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్..!