ఏపీ సీఎం జగన్ భార్య భారతి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా..? ఇందుకోసం నియోజకవర్గం కూడా ఫిక్స్ చేశారా..? రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే భారతిని రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారా..? కొంతకాలంగా రాజకీయ భేటీలకు భారతిని జగన్ వెంటబెట్టుకెళ్ళడం దేనికి సంకేతం..?ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ భార్య భారతి. ఆమె మొదటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయిన సమయంలో వైసీపీ తరుఫున ఆయన సోదరి వైఎస్ షర్మిల రాజకీయాలు కొనసాగించేరే కాని భారతి ఎక్కడ కూడా కనిపించలేదు. ఆమె పూర్తిగా జగన్ వ్యాపారాలను మాత్రమే చూసుకుంటారు. రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోరు. అలాంటిది ఆమెను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలపాలని జగన్ భావిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది.
జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతిని బరిలో నిలిపితే ఎలా ఉంటుందని సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాలో వైసీపీకి పూర్తిగా పట్టుంది. జమ్మల మడుగు కూడా వైసీపీకి కంచుకొటే. సిట్టింగ్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక, ఇక్కడి నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తోన్న మాజీమంత్రి రామసుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చినా వర్గపోరుతో ఆయన గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. అందుకే ఆయనకు ఎదో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చి.. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతిని బరిలో నిలిపెలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
జగన్ మీద సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. అలాగే వివేకా హత్య కేసు ఒకటి సీబీఐ టేకప్ చేసింది. కేంద్రం మీద ధ్వజమెత్తితే ఈ కేసులు జోరందుకుంటాయి. దాంతో కొత్త ఇబ్బందులు వస్తాయి. అక్రమాస్తుల కేసులో జగన్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. అందుకే జగన్ సతీమణి భారతి ఎమ్మెల్యేగా ఉంటే జగన్ కి ఇబ్బందులు ఏమైనా ఎదురైతే సీఎంగా భారతిని నియమించడానికి వీలు ఉంటుందని ముందుగా ఈ ప్లాన్ వేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఈ విషయం మీద వైసీపీలోనూ చర్చ సాగుతోంది.