వైఎస్ వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు సీబీఐ మరోసారి నోటిసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ నెల 24న హైదరాబాద్ లోని ఆఫీసుకు రావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించిన సీబీఐ… భాస్కర్ రెడ్డికి మాత్రం ఎక్కడ హాజరు కావాలో ఆయన ఇష్టానికి వదిలేయడం హాట్ టాపిక్ అవుతోంది.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ఉద్దేశ్యంతోనే ఆయన్ను మరోసారి విచారణకు పిల్చారని.. అందుకే తండ్రికి మినహాయింపు ఇచ్చి అవినాష్ రెడ్డికి మాత్రం హైదరాబాద్ లోనే విచారణకు రావాలంటూ ఆదేశించారని అంటున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతి కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డినే కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రెడీ అయిందని అంటున్నారు.
వివేకా హత్య గురించి ఉదయం తెలిసిందని అవినాష్ రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ ఆయన తెల్లవారుజామున మూడు గంటలకే జగన్ , భారతి పీఏలకు ఫోన్లు చేశారు. పని మనిషి వచ్చే వరకు వివేకా మరణం గురించి తెలియదని చెబుతు వచ్చిన అవినాష్ రెడ్డి.. తెల్లవారుజామున జగన్, భారతి పీఏలకు ఎందుకు ఫోన్లు చేశారని సీబీఐ తేల్చే పనిలో పడింది.
ఈ మర్డర్ కేసు క్లిష్టమైన కేసుగా మారింది. హైప్రొఫైల్ కేసు కావడం.. నిందితులు అధికార బలం ప్రయోగిస్తూ ఉండటం సమస్యగా మారింది. ఇదే సమయంలో సీబీఐ కూడా ఈ కేసును చేధించేందుకు పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తోంది. విచారణ హైదరాబాద్ కు మారడంతో సీబీఐపై ఒత్తిళ్ళు కూడా తగ్గడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.