తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. పార్టీలోకి వైఎస్సార్ సన్నిహితులు, కాంగ్రెస్ పార్టీ నేతలు బోలెడు మంది వస్తారని పార్టీ ఏర్పాటుకు ముందు షర్మిల లెక్కలు వేసుకున్నారు కానీ పార్టీ ఏర్పాటు తరువాత పేరున్నా నేతలెవరూ షర్మిల పార్టీ వైపు చూడటమే లేదు. అసలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా ఉందా..? అనే స్థితి నెలకొనడంతో విధిలేని పరిస్థితుల్లో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.
పాదయత్ర చేస్తూ పార్టీకి కాస్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు. దాంతో ఆమె ఏ నియోజకవర్గాలకు వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం స్టార్ట్ చేసి మీడియాలో కవరేజ్ సంపాదించుకున్నారు. గతంలో పాదయాత్ర చేసి అన్నకు తోడుగా నిలిచినా షర్మిల ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. షర్మిల పాదయత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు వరుస ప్రకటనలతో ఆమె హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఉద్రిక్తతల నడుమే ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఈ సమయంలోనే షర్మిల గురించి అందరూ ఆరా తీస్తున్నారు.
రెండు పెళ్ళిళ్ళు
వైఎస్ షర్మిల. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల కూతురు. తండ్రి రాజకీయాల్లో ఉండటం షర్మిలకు చిన్న వయస్సులో పెద్దగా నచ్చేది కాదు. ఎందుకంటే.. ఈ రాజకీయాల వలనే తన తండ్రి ఎక్కువ సమయం ఫ్యామిలీకి కేటాయించడం లేదని షర్మిల ఫీలింగ్. ఇకపొతె పులివెందులలో చదువుకున్న షర్మిల.. అన్న జగన్ తోపాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటానని మారం చేయడంతో ఆమెను అక్కడికి మార్పించారు.
ఇక చెన్నైలో ఏంబీఏ పూర్తి చేసిన షర్మిలకు తన మేనమామ చంద్ర ప్రతాప్ రెడ్డిని ఇచ్చి పెళ్లి చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అతనితో పెళ్లి ఇష్టం లేకపోయినా తండ్రి మాటను కాదనలేక చంద్రప్రతాప్ ను పెళ్లి చేసుకుంది. కానీ ఆరు నెలలకే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు. షర్మిల పుట్టింటికి వచ్చేసింది. తరువాత విడాకులు తీసుకున్నారు షర్మిల.
ఈ క్రమంలోనే కామన్ ఫ్రెండ్ ద్వారా అనిల్ తో షర్మిలకు పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ విషయం తండ్రికి చెప్తే ఆలోచించాడు. చివరికి అనిల్ ను షర్మిల 1995లో వివాహం చేసుకుంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అనిల్ పెళ్లి తరువాత క్రిస్టియన్ గా మారాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మధ్య ప్రభాస్ తో షర్మిలకు ఎఫైర్ ఉందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తను ఖండిస్తూ షర్మిల కంప్లైంట్ చేశారు. ప్రభాస్ కూడా స్పందిస్తూ.. తనకు వైఎస్ షర్మిల ఎవరో తెలియదని క్లారిటీ ఇచ్చాడు.
Also Read : పాలేరులో గెలుపు కోసం వైఎస్ షర్మిల స్ట్రాటజీ..!