ఈ మధ్యకాలంలో వచ్చిన ఒటీటీ టాక్ షో లో విశేష ఆదరణ పొందిన షో ఏదైనా ఉందంటే అది‘అన్ స్టాపబుల్ విత్ NBK’.బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న షో కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
మొదటి సీజన్ కంటే రెండో సీజన్ కు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కారణం.. సెకండ్ సీజన్ లో ప్రభాస్ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు పాల్గొనడమే. భారీ ఆదరణ పొందిన ఈ షో… రెండు సీజన్లతోనే నిలిచిపోనుందనే ప్రచారం జరుగుతోంది.
సీజన్ 1 గ్రాండ్ ఫినాలే లో బాలయ్య బాబు మాట్లాడుతూ… సెకండ్ సీజన్ ఉంటుంది, త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటూ చెప్పాడు. కానీ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లో మాత్రం ఇక సెలవు అనే అర్థం వచ్చేట్టు ‘ఈ జ్ఞాపకాలు చిరకాలం నా మదిలో ఉంటుంది’ అని అంటాడు బాలయ్య. అంటే దానికి అర్థం సీజన్ 3 లేదనీ అంటున్నారు.
‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ద్వారా హీరోయిన్స్, హీరోలను ఇంటర్యూ చేసి పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బాలయ్య. ప్రభాస్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పెళ్లి గురించి అడగగా.. పవర్ స్టార్ జరిగిన ఇంటర్వ్యూలో మూడు పెళ్ళిళ్ళ గురించి అడిగి అన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
ఈ టాక్ షో ద్వారా నేటి తరం స్టార్ హీరోలలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రమే రావాల్సి ఉంది. ఇక బాలయ్య తరం హీరోలైన చిరంజీవి , వెంకటేష్ మరియు నాగార్జున వంటి వాళ్ళు కూడా బ్యాలెన్స్ ఉన్నారు. వారితో సీజన్ 3 ఉంటుందన్న ప్రచారం జరిగింది కానీ తాజాగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ముగియనుందనే వార్త అభిమానులకు మింగుడు పడటం లేదు.