కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. బొమ్మా బొరుసు లాగా గొప్ప గొప్ప నాయకులకు 9 మంచి లక్షణాలతో పాటు ఒక ఆవలక్షణం కూడా ఉంటుంది. కెసిఆర్ కూడా దీనికి మినహింపు కాదు. ఆకలితో ఉన్నవాడిని చూసి చలిస్తారు. కంట తడి పెట్టుకుంటారు. వాడికి కడుపునిండా అన్నం పెట్టాలని మటన్ బిర్యానీ వండుతారు. మంచి విస్తరి వేసి గౌరవంగా కుర్చోపెడతాడు. కానీ తినే ముందు బిర్యనిలో తుపుక్కున ఉమ్మి ‘ఇక తిను బిడ్డా’ అంటారు. ఈ ఒక్క ఆవలక్షణం ఆయనను మొదటినుంచి అబాసుపాలు చేస్తోంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
2001లో టిఆర్ఎస్ స్థాపించి దేశంలో సంచలనం సృటించారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డంకులు ఏర్పడిన ప్రతిసారి తన పదవికి రాజీనామా చేసి, పార్టీతో రాజీనామాలు చేయించి ప్రజల్లోకి వెళ్లి మళ్ళి గెలిచారు. ఆయన అహింస పిలుపుతో తుపాకుల ఉద్యమాల గడ్డ యావత్తు తెలంగాణ అహింసతో కదం తొక్కింది. ఎక్కడా ఆంధ్ర వాళ్ళను కొట్టలేదు, తిట్టలేదు. ఆ స్టానంలో తెలంగాణ కోసం ఎందరో త్యాగధనులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
నేను కూడా తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేస్తాను అని 2009 నవంబర్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మరో మహాత్మా గాంధీ అవతరించారని యావత్తు దేశం గర్వించింది. తెలంగాణ మొత్తం రోడ్ల మీదికి వచ్చింది. కేంద్రంలో కదలిక మొదలయింది. కానీ నాలుగో రోజు దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించి నిమ్మ రసం తాగారు. యావత్తు తెలంగాణ కన్నెర్ర చేసింది. గద్దర్ లాంటి వాళ్ళు బాహాటంగానే తిట్టారు. ఉద్యమకారుల నుంచి అవమానం పొందారు. వెంటనే తన తప్పును సరిదిద్దుకుంటూ ”నేను దీక్ష విరమించలేదు. నా మీద అబండాలు వేశారు” అని ‘యూ’ టర్న్ తీసుకుని ఎప్పరిలా దీక్ష కొనసాగించారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలిపి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాటిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. చివరికి ఆ మాట తప్పారు. పైగా తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు. మేము సాధించుకున్నాము అని ఎప్పటిలా ‘యూ’ టర్న్ తీసుకున్నారు. అన్నం పెట్టిన కాంగ్రెస్ కి సున్నం పెట్టరాదని ఉద్యమకారులు ఆయనను మందలించారు. చివరికి తన తప్పును నిర్భయంగా ఒప్పుకుని ”కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదు” అని తన నిజాయితీని చాటుకున్నారు.
కాంగ్రెస్ కుటుంబ పాలనను దుమ్మెత్తి పోశారు. చివరి అతను కూడా తన కుటుంబానికే పెద్దపీట వేశారు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. కానీ అయన పుట్టినరోజున చెప్పి బాధ పెట్టడం మంచిది కాదు. తప్పులు చేయడం మనిషి నైజం. కానీ తన తప్పును తెలుసుకున్నవాడే మనిషి. అందుకే ఈ ఒక్క అవలక్షణం మానుకుంటే కానీ అతను మునుపటి గౌరవాని తెలంగాణాలో పొందలేరు. ఇకనుంచైనా ఆయన పద్దతి మార్చుకుంటారని ఆశిద్దాం. జై తెలంగాణ!