”కాసింత కొమ్ము సెనగ పిండిని గోధుమ పిండి కలిపి రొట్టెలు చేసుకుని తింటే మధుమేహం పోతుందిరా” అని మూలకు పడున్న ముసలమ్మా చెపితే పాతకాలం మనిషి అని కొట్టిపడేస్తాము. 90 ఏళ్ళు నిండినా ఆమెకు మధుమేహం రాకుండా ఎందుకు చావలేదో మనకు అర్థమై చావదు. 18 ఏళ్లకే మనకు మధుమేహం ఎందుకు వచ్చిందో అంతకంటే అర్థమై చావదు. 45 ఏళ్ల అమ్మ రోజు మధుమేహం మాత్రలు ఎందుకు వేసుకుంటుందో భోదపడదు. 50 ఏళ్ల నాన్న మధుమేహం నిరోధక ఇంజక్షలు తనకు తాను ఎందుకు తీసుకుంటాడో తెలియదు. ‘మందు’కు అలవాటు పడక పోయినా మనం ‘మందుల షాప్’కి వెళ్ళడం అలవాటు పడ్డాము.
‘కొమ్ము సెనగ పిండిని గోధుమ పిండి కలిపి రొట్టెలు చేసుకుని తింటే మధుమేహం పోతుంది’ అని మన ఆయుర్వేద డాక్టర్లు చెపితే నవ్వుతాము. తాత్కాలిక ఉపశమనానికి అలవాటుపడిన మనం శాశ్వతం పరిష్కాల కోసం ఏనాడో మరిచాము.కానీ ఇదే ఫార్ములాను ఫారిన్ శాస్త్రవేత్తలు చెపితే ‘అవురా! నిజమా?’ అని బుద్దిగా వింటాము.
లండన్ శాస్తవేత్తలు ఏళ్ల తరబడి పిండి వంటకాల మీద చేసిన పరిశోధన ఫలితాలను ‘బయోమెట్రిక్’ (వేలు ముద్ర) ముసలమ్మా మన చిన్నపుడే చెప్పింది. మనం వింటే కదా. ఫారిన్ సరుకుకులకు అలవాటుపడిన మనము ఇకనైనా లండన్ శాస్తవేత్తలు మాటలను విందాము. ఇక నుంచి కొమ్ము సెనగ పిండిని గోధుమ పిండి కలిపి రొట్టెలు లేదా బ్రెడ్ తింటే మధుమేహం పోతుంది. కాబట్టి పిజ్జా, బర్గర్ లకు బదులు ఈ రొట్టెలు, లేదా బ్రెడ్ లు తిని మన ఆరోగ్యం కాపాడుకుందాము.