ఫిబ్రవరి 17న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. బీఆర్ఎస్ బాస్ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాడర్ ఫుల్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయింది. కానీ ఇదే ఫిబ్రవరి 17 నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్ కు తంటాలు తెచ్చి పెట్టింది. కారణం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సుప్రీంకోర్టులో 17వ తేదీన విచారణకు రానుండటమే.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తె ఓకె. లేదంటే సీబీఐ రంగంలోకి దిగి పంజా విసిరే అవకాశం ఉంది. కేసీఆర్ జన్మదినం రోజున ఆ పార్టీ నేతలకు మజా లేకుండా చేసే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు చూస్తుంటే రేపటి నుంచే రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే కేసీఆర్ జన్మదినం రోజే రాజకీయ యుద్దంలో బీఆర్ఎస్ చతికిల పడినట్లే.
సీబీఐ విచారణపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సర్కార్ పిటిషన్ వేసినప్పుడు… సీబీఐ విచారణపై స్టే విధించాలని ప్రభుత్వం కోరినా సుప్రీం పట్టించుకోలేదు. సిట్ వద్ద ఉన్న డీటేయిల్స్ ఇవ్వడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి నిరాకరించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాతే ఇస్తామని చెబుతున్నారు. దాంతో శుక్రవారం ఏం జరుగుతుందోననే ఉత్కంట నెలకొంది. సుప్రీం కోర్టు తీర్పు కోసం నలుగురు ఎమ్మెల్యేలు, కేసీఆర్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బర్త్ డే వేడుకలు దేవుడెరుగు ఈ కేసు గండంలా మారిందని భావిస్తున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్, ఆనాటి ఫుటేజీని పరిశీలించారు. వీడియోలు, ఆడియోలు కేసీఆర్ వద్దకు ఎవరు చేరవేశారో కాల్ డేటా, టవర్ లొకేషన్స్ పరిశీలించారు. పోలీస్ అధికారుల టైమింగ్స్, ఎమ్మెల్యేల స్పై కెమెరాలను సరిచూసుకున్నారు. టెక్నికల్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఎవరెవరని విచారించాలో ప్లాన్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత సీబీఐ రంగంలోకి దిగనుంది.