ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నోటి దురదతో చేసిన కామెంట్స్ బండి సంజయ్ కి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అయ్యింది. కాదు….కాదు…. కోతికి విస్కీ బాటిల్ దొరికినట్లు అయ్యింది. దీనిని పట్టుకుని బిఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టాయని అక్రమ సంబంధం అంటగట్టాడు.
ఆ మాట కొస్తే బిజెపి, బిఆర్ఎస్ కి మొదటినుంచి అక్రమ సంబంధం ఉన్నదని కాంగ్రెస్ వాదించింది. దానిని నిజం చేస్తూ బండి నేడు రైడింగ్ లో దొరికాడు. అది ఎలాగో చెప్పాలంటే కొంచం వెనక్కి వెళ్ళాలి. రెండేళ్ళ కిందట జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో లింగోజీ గూడ డివిజన్ నుంచి బిజెపి కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ గెలిచారు. ఆయన ప్రమాణస్వీకారం చేయకుండానే చనిపోయారు. మళ్ళి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నేతలు నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానున్న కేటీఆర్ ను కలిశారు. ఏకగ్రీవానికి కేటిఆర్ కూడా ఒప్పుకున్ని బిజెపితో చేతులు కలిపాడు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ ఈ కుట్రను కాంగ్రెస్ బహిర్గతం చేసింది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ఓటర్లకు చెప్పింది. రెండు పార్టీల అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. విషయం సీరియస్ గా మారడంతో వెంటనే బండి సంజయ్ రంగంలోకి దిగాడు. అబ్బే.. బీజేపీ నేతలు కేటీఆర్ ను కలిసిన విషయం తనకు తెలియదని.. వారంతా నాకు సమాచారం అందించకుండానే కేటీఆర్ ను కలిశారని చెప్పాడు. దీనిపై త్రిసభ్య కమిటీ కూడా వేశాడు. ఆ నివేదిక ఏమైందో ఇప్పటికీ బయటకు రాలేదు. కేటీఆర్ ను కలిసిన వారిపై చర్యలూ తీసుకోలేదు. ఇక, బిజెపి, బిఆర్ఎస్ మధ్య నెలకొన్న అక్రమ సంబంధాని తేటతెల్లం చేసి ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.
కానీ నిన్న జి హెచ్ ఎం సి కార్పోరేటర్ల ఫ్లోర్ లీడర్ల జాబితాలో గతంలో కేటీఆర్ ను కలిసిన కొప్పుల నరసింహా రెడ్డి, వంగా మధుసూధన్ రెడ్డికి ఉన్నత పదవులు కట్టబెడుతు ప్రమోషన్ ఇచ్చాడు బండి. కొప్పుల నరసింహ రెడ్డికి జి హెచ్ ఎం సి ఫ్లోర్ లీడర్ గా, వంగా మధుసూదన్ రెడ్డికి అధికార ప్రతినిధిగా పదవులు కట్టబెట్టారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిసినప్పుడు బండి సంజయ్ పై వెటకారంగా ఆపార్టీ నేతల ముందే కేటీఆర్ సెటైర్లు వేసినా ఒక్కరంటే ఒక్కరు వారించలేదు సరికదా పగలబడి నవ్వుకున్నారు. అయినప్పటికీ వారికే పదవులు కట్టబెట్టారు బండి సంజయ్. అంటే ఆ నేతలకు పదవులు ఇవ్వాలని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చాయా..? ఆ ఆదేశాలతోనే నిన్న బండి సంజయ్ ఆ నేతలకు పదవులు కట్టబెట్టారా..?
దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసిన ఈ నాయకులను ప్రొమోషన్ ఇచ్చాడంటే కాంగ్రెస్ చేసిన ఆరోపణ నిజం కాదా? ఇప్పుడు బండి సంజాయి రెడ్ హ్యాండ్ డేడ్ గా దొరకలేదా? ఈ పదవులు కేటిఆర్ కనుసన్నల్లో జరగలేదా? బిజెపి, బిఆర్ఎస్ మద్య అక్రమ సంబంధం లేదంటే ఇంకా ఎవరు నమ్ముతారు? ఇటీవల ఈటల రాజేందర్ బీజేపీలో కోవర్టులు ఉన్నారని ఉరికే అనలేదేమోనని తాజాగా రుజువు అవుతోంది.
Also Read : పవర్ ఫుల్ ప్లేసు అయితే ఎందుకు కవిత ఎగేసుకొని వెళ్తున్నారు..?