అవును. ఈ వార్త మీకు అతిశయోక్తిగా అనిపించొచ్చు. కానీ జరుగుతోన్న పరిణామాలను సునిశితంగా గమనిస్తే ఈ డౌట్ రాక మానదు. ఆప్ – బీఆర్ఎస్ రెండు పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తాపత్రయపడుతోన్న పార్టీలే. ఈ ప్రయాణంలో బీఆర్ఎస్ కన్నా ఆప్ ముందంజలో ఉందన్నది స్పష్టం. ఈ విషయం బీఆర్ఎస్ నేతలకూ తెలుసు. ఆప్ కు దీటుగా బీఆర్ఎస్ ను జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించేలా చేయాల్సిన బీఆర్ఎస్ నేతలు ఆ పని చేయడం లేదు. కానీ ఆ బాధ్యతను ఆప్ సీఎం తీసుకోవడం గమనార్హం.
పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ కు బీఆర్ఎస్ సీఎం పాలన నచ్చింది. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని దాని గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనల వలన తెలంగాణ అభివృద్ధి గురించి తెలుసుకొని… పంజాబ్ లో ఎంతమేర అమలు చేస్తారో…?చూడాలి. భగవంత్ మాన్ టూర్ వలన జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చ జరుగుతోంది. ఇది ఓ రకంగా బీఆర్ఎస్ కు ఫ్రీ ప్రమోషన్ లాంటిదే. ఆప్ కు ఏరకంగా మేలు చేస్తుందో ఆ పార్టీ నేతలకే తెలియాలి.
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం కోసం పంజాబ్ సీఎం తెలంగాణ టూర్ ను ముందుగానే ఖరారు చేసుకున్నారు. సెక్రటేరియట్ ఓపెనింగ్ వాయిదా పడినా ఆయన మాత్రం తన పర్యటనను వాయిదా వేసుకోలేదు. భగవంత్ మాన్ కు కేసీఆర్ స్వయంగా తెలంగాణలో తాను చేసిన అభివృద్ధిని చూపించబోతున్నారు. సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రిని తీసుకెళ్లనున్నారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ లను చూపిస్తారు. పలు గ్రామాలతో పాటు వాగు చెక్ డ్యామ్ ను చూపించి తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు.
దేశమంతా ఢిల్లీ మోడల్ గురించి మాట్లాడుకుంటుంటే…ఆప్ కు చెందిన మరో ముఖ్యమంత్రి మాత్రం తెలంగాణ మోడల్ గురించి తెలుస్కోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పంజాబ్ సీఎం తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అభివృద్ధిని చూసి… దేశానికి పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆప్ నేతల్లోనూ ఆశ్చర్యానికి కారణం అవుతోంది. పంజాబ్ సీఎం ఉద్దేశ్యం ఏంటో ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు.
ఆయన తీరు చూస్తుంటే…భవిష్యత్ లో భగవంత్ మాన్ బీఆర్ఎస్ లో చేరే అవకాశం లేకపోలేదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : కేసీఆర్ కు ఏమైంది.. ఇలా మారిపోయారు..?