జనసేన ప్రచార రథం ‘వారాహి’కి తెలంగాణలో ఉన్న కొండగట్టు ఆంజన్న సన్నిధిలో పూజ చేయించారు పవన్ కళ్యాణ్. అది మంగళవారం కావడం వలన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆ భక్తులను పక్కకు నెట్టి విఐపి కోటాలో ఆయనకు పూర్ణకుంబ స్వాగతంతో ప్రత్యెక దర్శనం చేయించారు అర్చకులు.
తన ప్రచార రథానికి తెలంగాణలో పూజలు చేయించిన పవన్ కళ్యాణ్ కు కొత్త అనుమానం వచ్చింది. తెలంగాణ దేవుడికి పూజలు చేయిస్తే ఆంధ్ర దేవుళ్ళకు కోపం రావచ్చు అనుకున్నారు. మనలాగే దేవుళ్ళకు కూడా ప్రాంతీయ ఫీలింగ్స్ ఉంటాయి అనుకున్నారు. విజయవాడలోని ఇంద్రకిలాద్రి దుర్గమ్మ దేవాలయానికి అదే జనసేన ప్రచార రథం వారాహికి డబుల్ ధమాకా లో రెండోసారి కూడా పూజ చేయించారు. తప్పులేదు. ఎవరి నమ్మకాలూ వాళ్ళవి. ఎవరి భక్తీ వాళ్ళది.
మిగతా రాజకీయ నాయకుల్లా, సాటి భక్తుడిలా ఆ దుర్గమ్మ తల్లికి ఓ పట్టు చీరను కానుకగా చదివించారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి అసలు సమస్యలు మొదలయ్యాయి. సామాన్యంగా దుర్గమ్మ దేవాలయానికి భక్తులు సమర్పించే చీరను ఇంద్రకిలాద్రి మీద ఉన్న దేవస్తానం కొట్టులో అదే ధరకు ప్రసాదంతో పాటు అమ్ముతారు. ఇప్పుడే రాజకీయం రంగు పులుముకుంటున్న పవన్ కళ్యాణ్ ఓ పట్టు చీరను చదివించానని, ఆ పట్టు చీర ధర ఎనిమిది వేలని మీడియాతో గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ చీర కావాలని భక్తులు పోటి పడుతున్నారు.
ఎవరికి అమ్మలో ఆలయం అధికారులకు అర్థం కావడం లేదు. దానిని వేలం పాటలో పెట్టి ఎవరు ఎక్కువ ధర పాడితే వాళ్ళకు అమ్మమని ఎవరో ఓ దిక్కుమాలిన సలహా ఇచ్చారు. భక్తిని వేలంపాటలో అమ్మడం అపచారం అని భయపడిన అధికారులు ఆ చీరను తిరిగి పవన్ కళ్యాణ్ కు తిరుగు టపాలో పంపాలని నిర్ణయించారు. ఈ దెబ్బతో మరోసారి హీరోలు ఇచ్చే చిరలను తీసుకోరాదని ఆలయ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.
Also Read : పవన్ ప్రచార రథం ‘వారాహి’ రోడ్డెక్కేది ఎప్పుడు?