ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ ఇచ్చింది. ఈ నెంబర్ కి ఫోన్ చేసి అవినీతికి పాల్పడే వాళ్ళను పట్టిస్తే రూ .5000/- నుoచి రూ 10000/-ఇస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది.
కలెక్టరేట్ కార్యాలయం, ఆర్డీఓ, విద్యుత్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, మండల కార్యాలయం, పోలీస్‌స్టేషన్, వాలంటీర్, సచివాలయం, ప్రభుత్వ హాస్పిటల్స్, 108, 104 సర్వీసులు…. ఇలా ఎవ్వరైనా సరే …. ఎక్కడైనా సరే ….. లంచం అడిగితే చాలు. 14400కి ఫోన్ చేసి వివరాలు చెపితే చాలు. మీ వివరాలతో పాటు లంచం అడిగిన అధికారి పేరుతో ఓ ఫిర్యాదు నమోదు చేయాలని పిలుపు నిచ్చారు.
పాస్ బుక్, కుటుంబ సభ్యులతో కూడిన సర్టిఫికేట్, జనన – మరణ ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ, ఎకనమికాల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఇలా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు సంబంధించి పిర్యాదు చేయవచ్చు. అనేక సర్వీసులు సంబంధించిన నెంబర్స్ తో ఫిర్యాదులు చెయ్యాలని కోరారు. ఎవరైనా చేయాల్సింది ఒక్కటే. అదే ఆర్జి నెంబర్, లేఖ సంబంధించిన కార్యాలయంలోని సిబ్బంది వివరాలతో ఫోన్ చెయ్యండి. గిఫ్ట్ పట్టండి.
తమ చేతుల్లోని ఫోన్ గనక ఉంటే చాలు. ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్ చేసి, బటన్ ప్రెస్ చేసి వీడియోద్వారా కానీ, ఆడియో ద్వారా కాని సంభాషణను రికార్డు చేయాలని అవినీతి నిరోధక శాఖ సూచించారు. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందన్నారు. దీనిని మించిన ఆధారం మరొకటి లేదు. ఇంకా ఎందుకు ఆలస్యం….లంచం ఇవ్వమని మిమ్మల్నివేదించే వాళ్ళను పట్టించి మీ పనులు చేయించుకొని, పైగా గిఫ్ట్ కొట్టేయండి.