వాగుకు గడ్డపారలే కొట్టుకుపోతుంటే గరికపోచ ఓ లెక్కా! మోడీ కుళ్ళు రాజకీయ వాగులో గడ్డపార లాంటి ఎల్. కె. అద్వాని లాంటి ఉద్దండుడే కొట్టుకు పొతే గరికపోచాలాంటి బాల్ థాకరే ఓ లెక్కా? 2002 లో నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నారు. మతకలహలల్లో అయన మెడకు ఉరి బిగిసింది. కానీ అ సమయంలో ఆయను కాపాడింది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎల్. కె. అద్వాని, రెండోవారు శివసేన అధినాయకుడు బాల్ థాకరే.
వాజ్ పేయి మొదలు మొత్తం బిజెపి మోడీనీ పార్టీ లోంచి సస్పెండ్ చేయాలనీ నిర్ణయించింది. చివరికి ఆ ఇద్దరి వల్ల మోడీ బతికి బట్ట కట్టాడు. నేడు ప్రధానిగా ఎదిగారు. అసలు మోడీ ప్రధానిగా మారడానికి ఎల్. కె. అద్వాని మూలపుషుడు. నేను ప్రధానిగా మారగానే మిమ్మల్ని రాష్ట్రపతిగా మారుస్తాను అని కాళ్ళ మీద పడ్డాడు మోడీ. అప్పటికే బిజెపిలో భీష్మా చార్యులు, ద్రోణా చార్యులుగా జోషి లాంటి సీనియర్లు ఉన్నారు. వాళ్ళ కాళ్ళు మొక్కడం ఇష్టం లేక, వాళ్లు రాగానే లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం ఇష్టం లేక, వాళ్ళను ‘సార్’ అని పిలువడం ఇష్టంలేని మోడీ కొత్త మెలిక పెట్టాడు. 70 ఏళ్ళు పై బడిన వాళ్ళు పార్టీలో ఉండడానికి వీల్లేదు అని సీనియర్లను అడ్డు తొలగించారు. తర్వాత ‘గురువు గారు…. గురువు గారు’..అని గురువు ‘గుండె’ మీద తన్నారు. ఎల్. కె. అద్వాని మీద రామ జన్మ భూమి కోర్ట్ కేసు ఉంది కాబట్టి, మిమ్మల్ని రాష్ట్రపతిగా చేయలేను అని ఇంటికి పంపి చేతులు దులుపుకుకున్నారు. బి జె పిలో తానే సీనియర్ అనే అమిత్ షా లాంటి తన మనుషులను మంత్రులుగా కళ్ళు మొక్కించుకున్నారు. ఇది కుట్రపూరిత చాణక్య నీతి.
సొంత పార్టీలోనే తండ్రి లాంటి ఎల్. కె. అద్వానికే ఇంత ద్రోహం చేసిన మోడీ పరాయి పార్టికి చెందిన బాల్ థాకరే చేసిన మేలును ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎందుకు మేలు చేస్తారు? తనకంటే సీనియర్లను ఎందుకు రాజకీయంగా బతకనిస్తారు? మోడీ కుట్ర రాజకీయాల గురించి తెలిసిన బాల్ థాకరే కొడుకు ఉద్దావ్ థాకరే నేడు మోడీ మోసగాడు అని ఏడవడం ఎందుకు? రామాయణం విన్నాకా రాముడికి సీత ఎం కావాలి అని అడిగినట్లు లేదు? తండ్రినే తుద ముట్టించడం కాదు. శత్రుశేషం ఉండకూడదని ఏక్నాథ్ షిండేతో నేడు ఉద్దావ్ థాకరే ప్రభుత్వాని కూడా నామరూపాలు లేకుండా కుల్చేసారు. ఇది మోడీ అసలు విశ్వరూపం.