మొదటినుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన నాలుకకు ఉన్న దురదను ప్రెస్ మైక్ తో గోక్కున్నాడు. ఇంట్లో ఉన్న ఎలుకలను చంపుతున్నాని ఇంటికి నిప్పు పెట్టినట్లు ఇంది ఆయన పద్దతి.
కాంగ్రెస్ స్టార్ క్యంపెనర్ గా నోటికొచ్చింది వాగారు. అతను చేసిన వ్యాఖ్యలు బిజెపికి మేలు చేసేవిదంగా ఉన్నాయి. కాంగ్రెస్ కొంప ముంచేలా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్లు అందరు ఎకమయినా, రేవంత్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 నుంచి 50 సీట్లు గెలవలేదని చిలక జోస్యం చెప్పారు. ఏ చెట్టు కింద కూర్చున్నాడో ఆ చెట్టు కొమ్మలు విరచాలని చూస్తున్నారు. మరో పార్టీలోకి దూకడానికి సిద్దపడినట్లు ఉన్నాయి ఈ ‘జంప్ జిలాని మాటలు’.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించలేదని అన్నారు. అందుకుగాను మరో జాతీయ పార్టీ బిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ఓ దిక్కుమాలిన సలహా ఇచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కెసిఆర్ ఎన్నడూ లేనిది కాంగ్రెస్ ని పొగిడారు. ప్రదాని మోడీ కంటే మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ వెయ్యి రెట్లు మేలని కితాబు ఇచ్చారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లలో బిఆర్ఎస్ గెలువదని, గాలి కాంగ్రెస్ వైపు విస్తోందని అన్ని సర్వేలు చెప్పడంతో కెసిఆర్ రక్షణలో పడ్డాడు. కాంగ్రెస్ తో పోత్తు పెట్లుకోవాలని తహతహలాడుతున్నాడు. ఇప్పుడు ఈ మాటలు కెసిఆర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నోటితో చెప్పిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాను కూడా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ని గెలిపిస్తానని సొంత డబ్బా కొట్టుకున్నాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ గెలుస్తుందని భావిస్తే తాను ఇంట్లో కుర్చుంటానని అన్నారు. అతని అవసరం కాంగ్రెస్ కి లేదనే పాద యాత్రకు పిలవలేదని గమనించాలి.
తాము బిజెపిలో కలువమని అన్నారు. బిఆర్ఎస్ తో కలుస్తామని తనకు తాను పి సి సి ప్రెసిడెంట్ లా భావించి పార్టి నిర్ణయంగా చెప్పారు. కాంగ్రెస్ ఏ పార్టీతో పోట్టుపెట్టుకోదు అని ఒక వైపు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పలుమార్లు కుండబద్దలు కొట్టారు. చివరికి అదినాయకత్వాన్ని కూడా కాదని తన సొంత పైత్యం బయట పెట్టారు. ఈదంతా చూస్తుంటే అయన రాత్రి తాగింది ఇంకా దిగలేదు అన్ని జనం నవ్వుకుంటున్నారు.