పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగింది మేలన్నది అవుట్ డేటెడ్ సామెత. పరుగెత్తి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం కంటే నిలబడి బీర్ తాగింది మేలు అన్నది అప్ డేట్ సామెత. పరుగెత్తి కెసిఆర్ చేసిన తొందరపాటు చర్యలవల్ల అన్ని పనులు వాయిదాలు పడుతున్నాయి. మొన్న సచివాలయం ప్రారంభోత్సవం, కొండగట్టు ఆంజనేయస్వామి సందర్శన వాయిదా పడింది.
దీనికి చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి. అందులో ప్రదానమైనది సెప్టెంబర్ 11, 2018 కొండగట్టు మీద ఘోర బస్సు ప్రమాదం జరిగి దాదాపు 60 మంది చనిపోయారు. నాడు వాళ్ళను పరామర్శించేందుకు కెసిఆర్ రాలేదు. చనిపోయినవాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. అక్కడ బిఆర్ఎస్ దాదాపు ఉడుచుకుపెట్టిపోయేలా ఉందని సర్వేల రిపోర్టులు అందాయి. దాంతో చలించిన కెసిఆర్ తన తప్పులను సరిదిద్దుకునే పని మొదలుపెట్టాడు.
అందులో భాగంగా హుటాహుటిన ఆ గుడికి 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మంగళవారం రావలసిన కెసిఆర్ బుధవారానికి రావడానికి మరో కారణం కూడా ఉంది. ప్రతి మంగళవారం ఈ గుడి భక్తులతో కిటకిటలాడుతుంది. గత నెలలో జనసేన నాయకుడు పవన్ కళ్యాన్ మంగళవారం రాకతో హడావుడి నెలకొని భక్తులకు ఇబ్బంది పడ్డారు.
ఆయన తన ప్రచార వాహనం ‘వారాహి’ని పూజ చేసుకుని వెళతానని చెప్పారు. కానీ అక్కడి జన సముద్రాని చూసి పూనకం వచ్చి అక్కడినుంచే తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసరికి భక్తులు నరకాన్ని చవిచుసారు. ఇప్పడు కెసిఆర్ కూడా తప్పక తన ఎన్నికల ప్రచారానికి ఈ యాత్రను వాడుకుంటారని ఆలయం నిర్వాహకులు మంగళవారం కాకుండా బుదవారం అనుమతి ఇచ్చారు. మిగతా రోజులో భక్తులు చాలా తక్కువగా వస్తారు
Also Read : టి. కాంగ్రెస్ సీనియర్లను దద్దమ్మలను చేసిన కోమటిరెడ్డి