కెసిఆర్ ని జీవితా రాజశేఖర్ మాములుగా తగులుకోలేదు, అడ్డంగా తగులుకున్నారు. బూతులు ఒక్కటే తక్కువ. ఆయన ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్ మీద ద్వజమెత్తారు. ఆ పథకం అక్రమార్కులకు కల్పతరువుగా మారిందని ఎద్దేవా చేశారు.
మొన్నటివరకు బిజెపిలో నిశబ్దంగా ఓ మూలకు పడున్న ఆమె ఒక్కసారిగా విజయశాంతి స్థానాన్ని ఆక్రమించారు. కెసిఆర్ ని మగాళ్ళతో కాకుండా ఆడవాళ్ళలో తిట్టించాలని బిజెపి వేసిన పథకం బాగానే ఫలిస్తోంది. మొన్నటివరకు డికే అరుణ, విజయశాంతిలు మాత్రమే తగులుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పోర్ట్ పోలియోలోకి జీవితా రాజశేఖర్ కూడా ఇచ్చారు. ఈ దెబ్బతో ఆమె బిజెపిలో ఉన్నారనే విషయం చాలా మందికి తెలిసింది.
సిద్ధిపేటలోని బిజెపి నాయకుడు దూది శ్రీకాంత్ రెడ్డి పోచమ్మ గుడిలో నిర్వహించిన ‘ప్రజగోస’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పోచమ్మ అవహించినట్లు ఆమెలో పూనకం లోడింగ్ అయ్యింది. మోడీ పోచమ్మ లాగా కుడబెడుతుంటే కెసిఆర్ మైసమ్మలా మాయం చేస్తున్నాడని సిగమూగింది. ఈసారి కెసిఆర్ గెలిస్తే ప్రజలకు మిగిలేవి కన్నీల్లే అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నాడని ఆరోపించారు. సిద్దిపేటలో నేరాలు – ఘోరాలు చూస్తుటే సినిమాల్లోని విలన్లు గుర్తుకు వస్తున్నారని నిందించారు.
కోనోకార్పస్ చెట్లవల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే కెసిఆర్ చోద్యం చూస్తున్నారని అన్నారు. హరిత హారం వల్ల బి ఆర్ ఎస్ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని నిందించారు.