పాదయాత్రలు ఎవరు చేస్తారు..? ఎక్కువగా రాజకీయ నాయకులే చేస్తుంటారు. కొందరు స్వామీజీలు కూడా. పాదయాత్రగా దైవదర్శనం చేసుకునేందుకు వెళ్తుండటం తెలుసు. కానీ పెళ్లికాని యువకులు కూడా పాదయాత్ర చేశారు. ఎందుకో తెలుసా..? పెళ్లి చేసుకునేందుకు ఓ అమ్మాయిని చూసి పెట్టు దేవుడా అంటూ పాదయాత్ర చేశారు. ఆశ్చర్యంగా ఉందా..? అవును. నిజమే. పెళ్లి కోసం రెండు వందల మంది యువకులు కాలినడకన పాదయాత్ర ప్రారంభించారు.
కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన దాదాపు 200 మంది యువకులు తమకు పెళ్లి కాకపోవడంతో ప్రముఖ శైవక్షేత్రమైన మలెమహదేవనబెట్టకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మండ్య నుంచి 105 కిలోమీటర్ల దూరంలో చామరాజనగర జిల్లాలో ఉన్న ఆలయానికి ఈ నెల 23న పాదయాత్రగా బయలుదేరి వెళ్ళారు.
ఈ రెండు వందల మంది యువకులు మండ్య జిల్లా మద్దూరు తాలూకా కేఎం దొడ్డి పరిసర గ్రామాలకు చెందిన వారే. వీరిదందరిది వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబమే. ఒక్కొక్కరికి పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. కాని వయస్సుకొచ్చిన పోరగాండ్లకు ఇంకా పెళ్లి కావడం లేదు. వయస్సు పైబడుతుంది. పెళ్లి చేసుకునేందుకు మాత్రం అమ్మాయి దొరకడం లేదు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన యువకులంతా తమ బాధను దేవునికి మోర పెట్టుకుంటేనైనా తీరుతుందని పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఇందులో 30 నుంచి 34 ఏళ్ల మధ్య వసున్నవారున్నారు.
గతంలో మాండ్య జిల్లలో భ్రుణ హత్యలు జరగడం కారణంగానే ప్రస్తుతం పెళ్లిళ్లకు అమ్మాయిల కొరత ఏర్పడిందని ఓ మహిళా రైతు నాయకురాలు వెల్లడించింది.