కొత్త గవర్నర్ ల నియామకంలో ప్రధాని కార్యాలయంలో రెండు రోజులుగా పెద్దగా చర్చలు జరగలేదు. కానీ తెలంగాణ కొత్త గవర్నర్ విషయంలో వాడి వేడి చర్చలు జరిగాయి. గంటల తరబడి తర్జనాలు బర్జనలు జరిగినట్లు తెలిసింది.
సుప్రీం కోర్ట్ మాజీ జస్టిక్ ఎస్. అబ్దుల్ నజీర్ ను తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించాలని మోడీ దాదాపు ఖరారు చేశాడు. మొదటి నుంచి ఇతను బీజేపీ కి అనుకూలంగా ఉన్నారు. రామజన్మ భూమి వివాదం సుప్రీం కోర్టుకు వెళ్ళినప్పుడు వేసిన కమిటిలో ఇతను కీలక పాత్ర పోషించారు. తీర్పు బీజేపీకీ అనుకూలంగా రావడంలో ఇతని పాత్ర అమోఘం. ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఎన్నో వివాదస్పద కేసులను చాలా చాకచక్యంతో తీర్పులు చెప్పిన పేరుంది.
ఇతను కెసిఆర్ ముక్కుకు తాడు వేస్తారు అనుకున్నారు. దానికి తోడూ తెలంగాణలో ముస్లింల ఓటు బ్యాంకు ఎక్కువ. అందుకే బీజేపీ ముస్లిం ఓటర్లను ఆకర్షించవచ్చు అనుకున్నారు. కానీ చివరి నిముషంలో మాజీ జస్టిక్ ఎస్. అబ్దుల్ నజీర్ ఎపి కి వెళ్ళడానికే మొగ్గు చూపాడని తెలిసింది. అంతేకాదు అసలు తెలంగాణకు రావడానికి ఏ గవర్నర్ కూడా ఆసక్తి చూపలేదు. కెసిఆర్ కుటిల రాజకీయాలు తట్టుకోవడం ఎవరితరము కాదు మరి.